Share News

Viral Video: బంతి పడిందని పాడుబడ్డ ఇంట్లోకి యువకుడు.. షాకింగ్

ABN , Publish Date - Jul 14 , 2025 | 05:56 PM

హైదరాబాద్ నాంపల్లి మార్కెట్ ప్రాంతంలోని ఒక యువకుడు చేసిన రీల్ సంచలనంగా మారింది. తాను చేసిన వీడియో వెనుక ఇంతటి దిగ్భ్రాంతికర విషయం ఉందా అని ఆ కుర్రాడు షాక్ అయ్యే పరిస్థితి..

Viral Video: బంతి పడిందని పాడుబడ్డ ఇంట్లోకి యువకుడు.. షాకింగ్
Skeleton

హైదరాబాద్, జులై 14: హైదరాబాద్ నాంపల్లి మార్కెట్ ప్రాంతంలోని ఒక యువకుడు చేసిన రీల్ సంచలనంగా మారింది. తాను చేసిన వీడియో వెనుక ఇంతటి విషయం ఉందా? అని ఆ కుర్రాడు ఇప్పుడు షాక్ అయ్యే పరిస్థితి ఏర్పడింది.

వివరాల్లోకి వెళ్తే, స్థానికంగా ఉండే యువకులు క్రికెట్ ఆడుతున్నారు. ఈ క్రమంలో బాల్ పక్కన ఉన్న ఇంట్లో పడింది. లోపలకి వెళ్లి బాల్ తెచ్చుకునే ప్రయత్నంలో అతనికి ఇంట్లో ఒక వింత సన్నివేశం కనిపించింది. ఆ ఇంట్లో.. మనిషి అస్తిపంజరాన్ని చూశాడా యువకుడు. దీంతో అతనికి ఒక ఐడియా వచ్చింది. దీనిని రీల్స్ చేస్తే మంచి వ్యూస్ రావడంతోపాటు, తన స్నేహితుల్నీ థ్రిల్ చేయొచ్చని ఆలోచనకు వచ్చాడు.

Clues-team-2.gifఅంతే, తన సెల్ ఫోన్ తో షూట్ చేసుకుంటూ.. మీకు ఒక షాకింగ్ వీడియో చూపిస్తానంటూ పాడుబడ్డ ఇంట్లోకి వెళ్లాడు యువకుడు. ఇంటి లోపలితోపాటు, అక్కడే ఉన్న మనిషి అస్తిపంజరం చూపిస్తూ వీడియో రికార్డ్ చేశాడు. ఆ వీడియోను తన ఫేస్‌బుక్ లో పెట్టాడు. అది కాస్తా వైరల్ కావడంతో సదరు రీల్ పోలీస్‌ల వరకూ వెళ్లింది. ఆ వీడియో చూసిన హబీబ్ నగర్ పోలీసులు యువకుడెవరని ఆరా తీసి, మొత్తానికి తెలుసుకుని అతడ్ని స్టేషన్‌కు పిలిచి వివరాలు అడిగారు.

Nampalli-House.gif


క్రికెట్ ఆడుతుండగా బాల్ ఆ ఇంట్లో పడటంతో తీసుకునేందుకు వెళ్లానని, అక్కడ అస్తిపంజరం కనిపించడంతో మరుసటి రోజు వీడియో తీశానని పోలీసులకు వెల్లడించాడు ఆ యువకుడు. దీంతో హబీబ్ నగర్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్లూస్ టీం సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. సదరు అస్తిపంజరం ఎవరిదని ఆరా తీస్తున్నారు.

Clues-team-3.gifఅయితే, ఏడు సంవత్సరాలుగా ఆ ఇంట్లో ఎవరూ లేరని, ఇంటి ఓనర్ విదేశాలలో ఉన్నట్లు స్థానికులు పోలీసులకు చెప్పారు. ఘటనా స్థలానికి సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్ చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Nampalli.gif


ఇవి కూడా చదవండి

గోవా గవర్నర్‌గా అశోక్ గజపతిరాజు నియామకం

ఆ మూడు ఘటనలు జగన్ కుతంత్రాల్లో భాగమే: దేవినేని

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 14 , 2025 | 06:51 PM