Konda Surekha: నాగార్జున కుటుంబాన్ని నొప్పించాలనే ఉద్దేశం లేదు: మంత్రి సురేఖ
ABN , Publish Date - Nov 12 , 2025 | 08:12 AM
నటుడు అక్కినేని నాగార్జున కుటుంబం మీద చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. ఆయన కుటుంబ సభ్యులను నొప్పించాలన్నా, అపకీర్తి కలిగించాలన్నా ఉద్దేశ్యం తనకు ఎప్పటికీ లేదని వ్యాఖ్యానించారు. తన వ్యాఖ్యలతో ఏమైనా అనుకోని అపోహలు కలిగినట్లయితే, దానికి తాను చింతిస్తున్నానని పేర్కొన్నారు.
హైదరాబాద్, నవంబరు12 (ఆంధ్రజ్యోతి): నటుడు అక్కినేని నాగార్జున కుటుంబం (Akkineni Nagarjuna Family) మీద తెలంగాణ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) ఇటీవల వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి సురేఖ మరోసారి స్పందించారు. ఈ క్రమంలో ఆమె నిన్న(మంగళవారం) అర్థరాత్రి సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. నాగార్జున కుటుంబం మీద చేసిన వ్యాఖ్యలను తాను ఉపసంహరించుకుంటున్నానని స్పష్టం చేశారు. నాగార్జున కుటుంబం మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశ్యం తనకు లేదని తేల్చిచెప్పారు మంత్రి కొండా సురేఖ.
ఆయన కుటుంబ సభ్యులను నొప్పించాలన్నా, అపకీర్తి కలిగించాలన్నా ఉద్దేశం తనకు ఎప్పటికీ లేదని వ్యాఖ్యానించారు. తన వ్యాఖ్యలతో ఏమైనా అనుకోని అపోహలు కలిగితే, దానికి తాను చింతిస్తున్నానని పేర్కొన్నారు. మరోవైపు రేపు(గురువారం) నాగార్జున పరువు నష్టం పిటిషన్‌పై విచారణ చేయనుంది నాంపల్లి స్పెషల్ కోర్టు. ఈ విచారణకు ఒక రోజు ముందుగా నాగార్జునను ట్యాగ్ చేస్తూ కొండా సురేఖ ఈ పోస్ట్ పెట్టారు. ఆమె పెట్టిన పోస్టు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఈ వార్తలు కూడా చదవండి...
వేములవాడ ఆలయంలో దర్శనాల నిలిపివేత.. భక్తుల ఆగ్రహం
Read Latest Telangana News And Telugu News