MP Konda Vishweshwar Reddy: మునుగోడు ఎన్నికల సమయంలో నా ఫోన్ ట్యాపింగ్
ABN , Publish Date - Jun 27 , 2025 | 02:42 PM
మునుగోడు, దుబ్బాక ఎన్నికల సందర్భంలో తన ఫోన్ ట్యాపింగ్ అయిందని బీజేపీ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. చట్టవిరుద్ధంగా తన ఫోన్ ట్యాపింగ్ చేశారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకు వ్యతిరేకత వచ్చిందని.. దాంతో అభద్రత భావంతో తన ఫోన్ ట్యాపింగ్ చేయించారని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి వెల్లడించారు.

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) బీజేపీ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి (MP Konda Vishweshwar Reddy) ఇవాళ(శుక్రవారం) జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో సిట్ అధికారులకు తన వాంగ్మూలం ఇచ్చారు. ఈ క్రమంలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి స్టేట్‌మెంట్‌ని సిట్ అధికారులు రికార్డ్ చేశారు. 2023 నవంబర్‌లో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఫోన్ ట్యాపింగ్ అయినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా మీడియాతో ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడారు. మునుగోడు, దుబ్బాక, హుజురాబాద్ ఎన్నికల సందర్భంలో తన ఫోన్ ట్యాపింగ్ అయినట్లుగా సిట్ అధికారులు చూపించారని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులకు స్టేట్‌మెంట్ ఇచ్చానని చెప్పారు. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చాక తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని పేర్కొన్నారు ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి.
మునుగోడు, దుబ్బాక ఎన్నికల సందర్భంలో తన ఫోన్ ట్యాపింగ్ అయిందని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి గుర్తుచేశారు. చట్టవిరుద్ధంగా తన ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకు వ్యతిరేకత వచ్చిందని.. దాంతో అభద్రత భావంతో తన ఫోన్ ట్యాపింగ్ చేయించారని అన్నారు. తన ఆఫీస్‌లో వారెంట్ లేకుండా వచ్చి కొందరు పోలీస్ అధికారులు దౌర్జన్యం చేసి.. ఫోన్ ట్యాపింగ్ చేశారని వెల్లడించారు. గత డీజీపీ మహేందర్‌రెడ్డి తన ఫోన్ ట్యాపింగ్ చేయించారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో తనతో పాటు తన అనుచరుల మూవ్‌మెంట్‌ని కూడా పసిగట్టారని చెప్పారు. తన స్నేహితుడు బంగారం కొన్న రూ.72 కోట్లను పోలీసులు పట్టుకున్నారని.. అవి తన డబ్బులు అన్నట్లుగా ఫోన్ ట్యాపింగ్ చేసి బెదిరించారని తెలిపారు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి.
తన భూమి అమ్మితే కొన్న వ్యక్తి పైసలు ఇచ్చారని.. అతన్ని కూడా హింసించి రూ.13 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ రాయించారని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి గుర్తుచేశారు. ఈటల రాజేందర్‌కి డబ్బులు ఇచ్చినట్లుగా కేసీఆర్ ప్రభుత్వంలో తనపై నిందలు మోపారని విమర్శించారు. తాను ఈటలకు ఎన్నికల సమయంలో సపోర్ట్ చేశానని.. కానీ డబ్బులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. తన మొబైల్ రికార్డింగ్ ట్యాపింగ్ కాకపోవడంతో లైవ్ ట్యాపింగ్ చేశారని చెప్పుకొచ్చారు. తనతో పాటు తన భార్య సంగీత ఫోన్‌ని సైతం ట్యాపింగ్ చేశారని మండిపడ్డారు. మునుగోడు ఎన్నికల సమయంలో తాము ఇన్‌చార్జ్‌లుగా ఉన్నపుడు తమ ఫోన్లు ట్యాపింగ్ చేశారని గుర్తుచేశారు. ఫోన్ ట్యాపింగ్‌కు హోం సెక్రటరీ అనుమతి ఉండాలి కానీ ఇక్కడ అవేమి లేకుండా ట్యాపింగ్ చేశారని ఫైర్ అయ్యారు. తన కాల్స్‌ని చట్టవిరుద్ధంగా రికార్డ్ చేశారని చెప్పారు. తాను పోలీసులకు ఫిర్యాదు చేస్తే తిరిగి తనపైనే నాన్ బెయిలబుల్ కేసు పెట్టి ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభాకర్‌రావుతో పాటు ఈ ట్యాపింగ్‌లో ఇన్వాల్ అయిన వారిని కఠినంగా శిక్షించాలని హెచ్చరించారు. ఫోన్ ట్యాపింగ్ కేసుపై పార్లమెంట్‌లో మాట్లాడుతామని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
గోల్కొండలో ఆషాఢ మాస బోనాల సందడి షురూ
మంత్రి సీతక్కకు మావోయిస్టుల హెచ్చరిక
Read Latest Telangana News And Telugu News