Home » Konda Vishweshwar Reddy
కేసీఆర్ ప్రభుత్వం తన ఫోన్ ట్యాపింగ్ చేయడమే కాకుండా తన ఇంట్లో బగ్ కూడా పెట్టి ఇంట్లో ఏం జరుగుతుందో లైవ్ సంభాషణ విన్నదని బీజేపీ నేత, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.
మునుగోడు, దుబ్బాక ఎన్నికల సందర్భంలో తన ఫోన్ ట్యాపింగ్ అయిందని బీజేపీ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. చట్టవిరుద్ధంగా తన ఫోన్ ట్యాపింగ్ చేశారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకు వ్యతిరేకత వచ్చిందని.. దాంతో అభద్రత భావంతో తన ఫోన్ ట్యాపింగ్ చేయించారని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి వెల్లడించారు.
కాళేశ్వరం.. ప్రపంచంలోనే అతి పెద్ద ఇంజినీరింగ్ తప్పిదం.. ప్రాజెక్టు డిజైన్‌లోనే లోపాలు ఉన్నాయి.. ఏ కోణంలో చూసినా వైఫల్యాలే ఉన్నాయి.. అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టు గురించి గొప్పలు చెప్పారు.
నగరంలోని గుల్జార్‌హౌజ్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై సమగ్ర విచారణ చేపట్టాలని బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 17మంది చనిపోవడం బాధాకరమన్నారు. ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలన్నారు.
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక కోసం భాయ్ భాయ్‌కే పార్టీ(ఎంఐఎం), బాప్ బేటేకే పార్టీ (బీఆర్‌ఎస్), బేటా బేటీకే పార్టీ(కాంగ్రెస్)లు కుమ్మక్కయ్యాయని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి విమర్శించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.8 లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీయించి ప్రభుత్వ భూములను అమ్ముకుందని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు.
వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదని బీజేపీ నేత, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. ముస్లింల ఓట్ల కోసం కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు దేశాన్నే అమ్ముకుంటాయని ఆరోపించారు.
స్వాతంత్య్రం సిద్ధించిననాటి నుంచి మైనారిటీలను వాడుకున్నదని కాంగ్రెస్ పార్టీ అని వారిని ఆదుకున్నది మాత్రం నరేంద్రమోదీ అని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి(Chevella MP Konda Visveshwar Reddy) అన్నారు.
మహేశ్వరం నియోజకర్గంలో బీజేపీ తిరుగులేని శక్తిగా అవతరించిందని, భవిష్యత్‌లో ఇక్కడ ఏ ఎన్నికలు జరిగినా కాషాయ జెండా రెపరెపలాడడం ఖాయమని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి(Chevella MP Konda Visveshwar Reddy) అన్నారు.
ఎన్నికల సమయంలో రైతాంగానికి ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసేదాకా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటాడతామని బీజేపీ తేల్చిచెప్పింది.