Transfers in Telangana Police: తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు
ABN , Publish Date - May 19 , 2025 | 09:23 PM
Transfers in Telangana Police: తెలంగాణ రాష్ట్రంలో భారీగా డీఎస్పీలను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు డీజీపీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో భారీగా డీఎస్పీలను(DSP) రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ(మే19)న బదిలీ చేసింది. 77మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ తెలంగాణ డీజీపీ జితేందర్ (Telangana DGP Jitender) ఉత్తర్వులు ఇచ్చారు. హైదరాబాద్ ,సైబరాబాద్‌లో పలువురు ఏసీపీలను బదిలీ చేశారు. రాష్ట్రంలో పాలనను మరింత సమర్ధవంతంగా తీర్చిదిద్దడానికి ఈ బదిలీలు చేపట్టినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
బదిలీ చేసిన అధికారుల పేర్లను జారీ చేసిన జీవో ద్వారా వెల్లడించారు. రాబోయే పలు కీలక సమీక్షలు, శాంతిభద్రతల నిర్వహణ నేపథ్యంలో అధికారులను మార్పు చేసినట్లు సమాచారం. ఈ బదిలీలతో ప్రభుత్వ యంత్రాంగాన్ని సమర్థవంతంగా నడిపేందుకు, పాలనపై పట్టు సాధించడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయా కీలక విభాగాల్లో అనుభవం ఉన్న అధికారులకు ప్రాధాన్యం ఇచ్చినట్లు సమాచారం. గత ప్రభుత్వ పాలనలో జరిగిన వైఫల్యాలను అధిగమించేందుకు, ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు.
బదిలీ అయిన అధికారులు వీరే...
బాలానగర్ ఏసీపీగా పి.నరేష్ రెడ్డి..
శంషాబాద్ ఏసీపీగా శ్రీకాంత్ గౌడ్
చిక్కడపల్లి ఏసీపీగా సీహెచ్ శ్రీకాంత్
మాదాపూర్ ఏసీపీగా సీహెచ్ శ్రీధర్..
మేడ్చల్ ఏసీపీగా సీహెచ్ శంకర్ రెడ్డి
సంతోష్ నగర్ ఏసీపీగా సుక్ దేవ్ సింగ్
మలక్‌పేట ఏసీపీగా సుబ్బరామిరెడ్డి
గాంధీనగర్ ఏసీపీగా ఏ. యాదగిరి
ఎస్సార్‌నగర్ ఏసీపీగా ఎస్వీ రాఘవేంద్రరావు
కాచిగూడ ఏసీపీగా వై. హరీష్ కుమార్
చాంద్రాయణగుట్ట ఏసీపీగా ఏ. సుధాకర్
కూకట్‌పల్లి ఏసీపీగా ఈ. రవి కిరణ్‌రెడ్డి
పేట్ బషీరాబాద్ ఏసీపీగా ఏసీ బాల గంగిరెడ్డి
పంజాగుట్ట ఏసీపీగా పి. మురళీకృష్ణ
మహేశ్వరం ఏసీపీగా ఎస్. జానకి రెడ్డి
షాద్‌నగర్ ఏసీపీగా ఎస్. లక్ష్మీనారాయణ
సైదాబాద్ ఏసీపీగా సోమ వెంకటరెడ్డి
గోషామహల్ ఏసీపీగా ఎస్. సుదర్శన్
కాచిగూడ ఏసీపీగా వై. వెంకట్‌రెడ్డి
చిలకలగూడ ఏసీపీగా శశాంక్ రెడ్డి
మహంకాళి ఏసీపీగా ఎస్. సైదయ్య
అబిడ్స్ ఏసీపీగా పి. ప్రవీణ్ కుమార్
ఈ వార్తలు కూడా చదవండి
HYD Fire Accident: ఓల్డ్‌సిటీ ఫైర్ యాక్సిడెంట్‌కి కారణం.. స్థానిక అక్రమ కరెంట్ కనెక్షన్లు.!
Gulzar House Fire Incident: గుల్జార్ హౌస్ ప్రమాదంపై ఎఫ్‌ఐఆర్ నమోదు
Hydra Demolitions: హైడ్రా కూల్చివేతలు షూరూ.. టెన్షన్ టెన్షన్
Read Latest Telangana News And Telugu News