Mahesh Goud: ప్రజల సొత్తుని అన్నిరంగాల్లో దోచుకున్నారు..కేసీఆర్‌పై మహేష్ గౌడ్ షాకింగ్ కామెంట్స్
ABN , Publish Date - Apr 28 , 2025 | 03:01 PM
Mahesh Goud: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల సొత్తుని కేసీఆర్ కుటుంబం అన్నిరంగాల్లో దోచుకుందని మహేష్‌కుమార్ గౌడ్ ఆరోపించారు.

హైదరాబాద్: బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ విమర్శించారు. బీజేపీ గురించి నిన్నటి సభలో కేసీఆర్ కనీసం మాట్లాడలేదని అన్నారు. కేసీఆర్ గాంధీ కుటుంబం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. నిన్నటి సభలో కేసీఆర్ మాట్లాడిన తీరును ఖండిస్తున్నామని అన్నారు. ఆ సభలో జనాలకంటే ఎక్కువ విస్కీ బాటిల్స్ ఉన్నాయని ఎద్దేవా చేశారు. సభలో మహిళలు కనిపించలేదని అన్నారు. ఇవాళ(సోమవారం) గాంధీభవన్‌లో మహేష్‌కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధిపై కేసీఆర్ చర్చకు సిద్ధమా అని మహేష్‌కుమార్ గౌడ్ సవాల్ విసిరారు.
అధికారం నుంచి దిగిపోయిన తర్వాత కూడా కేసీఆర్ అబద్ధాలతో మభ్యపెట్టడానికి చూస్తున్నారని మహేష్‌కుమార్ గౌడ్ విమర్శలు చేశారు. అతి తక్కువ సమయంలో ప్రజాధనాన్ని దోచుకున్న కుటుంబం కేసీఆర్‌దని ఆరోపించారు. దేశం కోసం సర్వం త్యాగం చేసిన గాంధీ కుటుంబం గురిచి మాట్లాడే స్థాయి కేసీఆర్‌ది కాదన్నారు. దొంగ పాసుపోర్టులు చేసుకునే కేసీఆర్‌కు కాంగ్రెస్ గురించి మాట్లాడే అర్హతే లేదని అన్నారు. కాంగ్రెస్ వల్లే కేసీఆర్ కుటుంబం ఈ స్థాయిలో ఉందని చెప్పారు. ఏఐసీసీ అగ్రనేత సోనియగాంధీ తెలంగాణ ఇవ్వటం వల్లనే కేసీఆర్ కుటుంబం కాస్ట్లీ కార్లలో తిరుగుతుందని ఆరోపించారు. కేసీఆర్ దరిద్రపు, దుష్టపాలన గురించి ప్రజలు మరిచిపోయారని అనుకున్నావా.. ఎప్పటికీ మర్చిపోరని మహేష్‌కుమార్ గౌడ్ హెచ్చరించారు.
420 వైఫల్యాలు కేసీఆర్‌వి… ఆయన చేసిన మోసాల గురించి సభలో ఎందుకు చెప్పుకోలేదని మహేష్‌కుమార్ గౌడ్ ప్రశ్నించారు. కనీసం ఆలోచన లేకుండా కేసీఆర్ తన కుటుంబం బాగుకోసం కాళేశ్వరం కట్టారని విమర్శించారు. తెలంగాణ కోసం ప్రాణాలు ఇచ్చిన వారికి ఒక్క పదవి ఇవ్వకపోగా ..తన కుటుంబానికే అన్ని పదవులు కట్టబెట్టారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో ఫోన్‌లో మాట్లాడుకునే స్వేచ్ఛ కూడా లేకుండా చేశారని ధ్వజమెత్తారు. కేసీఆర్ హయాంలో విద్య, వైద్యం నిర్లక్ష్యం చేయడం వాస్తవం కాదా అని నిలదీశారు. కేసీఆర్ హయాంలో వడ్ల కుప్పలపై రైతులు ఆత్మహత్యలు చేసుకున్నది మర్చిపోయారా అని ప్రశ్నించారు. తాము చేసిన కులగణనపై కనీసం కేసీఆర్ నోరు విప్పలేదని మండిపడ్డారు. కవిత, హరీష్ రావుని సభలో పట్టించుకోలేదన్నారు. జన్వాడ ఫాంహౌస్ ఎవరివి.. వాటికోసం జీవోలు మార్చారని ఆరోపించారు. కేసీఆర్ పర్మినెంట్‌గా ఫాంహౌస్‌కే పరిమితం కావాలని ప్రజలు అనుకుంటున్నారని అన్నారు. ప్రజల సొత్తుని అన్నిరంగాల్లో దోచుకున్నారని మహేష్‌కుమార్ గౌడ్ విమర్శలు గుప్పించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
CM Revanth Reddy: ప్రపంచానికి దిక్సూచి తెలంగాణ
Mahesh Babu: విచారణకు రాలేను.. మరో తేదీ ఇవ్వండి
Kaleshwaram: బినామీల గుట్టు విప్పని హరిరామ్!
Read Latest Telangana News And Telugu News