Share News

Warangal Congress Dispute: వరంగల్ ఇష్యూ.. మీనాక్షికి నివేదిక ఇచ్చిన కొండా దంపతులు

ABN , Publish Date - Jul 03 , 2025 | 10:33 AM

Warangal Congress Dispute: తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్‌తో కొండా సురేఖ, మురళి ఎమ్మెల్యే క్వాటర్స్‌లో సమావేశయ్యారు. 16 పేజీల నివేదకు ఇంచార్జ్‌కు ఇచ్చారు కొండా దంపతులు.

Warangal Congress Dispute: వరంగల్ ఇష్యూ.. మీనాక్షికి నివేదిక ఇచ్చిన కొండా దంపతులు
Warangal Congress Dispute

హైదరాబాద్, జులై 3: కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్‌ను (Meenakshi Natarajan) కొండా దంపతులు (Konda Couple) కలిశారు. ఈరోజు (గురువారం) ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు వచ్చిన కొండా మురళి, సురేఖ (Konda Murali Surekha).. ఉమ్మడి వరంగల్‌లో జరుగుతున్న అంశాలపై మీనాక్షికి నివేదిక ఇచ్చారు. మొత్తం 16 పేజీల నివేదికను మీనాక్షి నటరాజన్‌కు కొండా సురేఖ అందజేశారు. ఉమ్మడి వరంగల్‌లో నియోజకవర్గం వారిగా ఇంచార్జ్‌కు రిపోర్ట్ ఇచ్చారు. తమపై వచ్చిన ఆరోపణలపై మీనాక్షికి కొండా సురేఖ, కొండా మురళీ సమాధానం చెప్పారు. రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చామని చెప్పిన కొండా దంపతులు.. నిజాలు తెలుసుకున్న తర్వాత ఎవరిది తప్పుంటే వాళ్ళపై చర్యలు తీసుకోవాలని కోరారు.


నేను ఏ తప్పు చేయలేదు: కొండా సురేఖ

ఇంచార్జ్‌తో భేటీ అనంతరం కొండా దంపతులు మీడియాతో మాట్లాడారు. ‘నాకు ఇచ్చిన శాఖలకు న్యాయం చేస్తున్నాను. రూల్స్ ప్రకారమే నేను పని చేస్తున్నాను. నా డిపార్ట్మెంట్‌లో ఉన్న ఫైల్స్ అన్నీ పరిశీలించుకోవచ్చు. మంత్రిగా నేను ఇప్పటి వరకు ఎలాంటి తప్పులు చేయలేదు. నా మంత్రి పదవిపై ఎవరు మాట్లాడినా నేను స్పందించాను. సుష్మితలో పారేది కొండా మురళీ, కొండా సురేఖ రక్తం. నా కూతురికి మా ఆలోచనలు వంశ పారపర్యంగా రావడంలో తప్పు లేదు. సుష్మిత రాజకీయ ఆలోచనలను తప్పు పట్టలేం’ అని కొండా సురేఖ అన్నారు.


అదే నా ఉద్దేశం: కొండా మురళి

‘నేను బీసీ కార్డును పట్టుకునే బతుకుతున్నాను. అణగారిన వర్గాలు బలం ఉన్నవాడి దగ్గరికే వస్తారు. పేదల సమస్యలు తీర్చుతాను కాబట్టే జనం నా దగ్గరికి వస్తాను. నాకు ప్రజాబలం ఉంది. పనిచేసే వారిపైనే బండలు వేస్తారు. నడిచే ఎద్దునే పొడుస్తారు . పార్టీ ఎవరికి టికెట్లు ఇచ్చిన గెలిపించే బాధ్యత నేను తీసుకుంటానని మీనాక్షితో చెప్పాను. మమ్మల్ని పార్టీ ఉపయోగించుకోవాలని చెప్పాను. పార్టీకి మీ సేవలు అవసరమని మీనాక్షి చెప్పారు. కాంగ్రెస్ పార్టీని బతికించడమే నా ఉద్దేశం. రాహుల్ గాంధీని ప్రధాని చేయడం నా ఉద్దేశం. రేవంత్ రెడ్డిని ఇంకో పదేండ్లు ముఖ్యమంత్రిగా చూడడం నా ఉద్దేశం. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌కు అండగా నిలుస్తా’ అని కొండా మురళి స్పష్టం చేశారు.


కాగా.. గత కొద్ది రోజులుగా ఉమ్మడి వరంగల్ పంచాయతీ కొనసాగుతున్న విషయం తెలిసిందే. కొండా వర్సెస్ మిగతా నాయకులుగా వివాదం నడుస్తోంది. ఇప్పటికే ఇరు వర్గాల నేతలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. గత శనివారం గాంధీ భవన్‌కు వచ్చిన కొండా మురళి.. క్రమశిక్షణ కమిటీతో భేటీ అయి నివేదికను అందజేశారు. తనపై వచ్చిన ఆరోపణపై వారం రోజుల్లో లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని కొండా మురళిని క్రమశిక్షణ కమిటీ ఆదేశించింది.


ఇవి కూడా చదవండి

క్యాడర్‌ను కదిలించని జగన్‌ పిలుపు

10న రెండో విడత తల్లికి వందనం

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 03 , 2025 | 11:41 AM