Share News

GHMC: గణేష్‌ నిమజ్జనానికి కృత్రిమ కొలనులు

ABN , Publish Date - Jul 03 , 2025 | 08:47 AM

గణేష్‌ విగ్రహాల నిమజ్జనం కోసం ముందస్తు ఏర్పాట్లపై జీహెచ్‌ఎంసీ దృష్టి సారించింది. కృత్రిమ కొలనుల ఏర్పాటుకు ఆసక్తి వ్యక్తీకరణ కోరుతూ బుధవారం టెండర్‌ నోటిఫికేషన్‌ ప్రకటించింది.

GHMC: గణేష్‌ నిమజ్జనానికి కృత్రిమ కొలనులు

- ఆసక్తి వ్యక్తీకరణ కోరుతూ జీహెచ్‌ఎంసీ టెండర్‌ నోటిఫికేషన్‌

హైదరాబాద్‌ సిటీ: గణేష్‌ విగ్రహాల నిమజ్జనం కోసం ముందస్తు ఏర్పాట్లపై జీహెచ్‌ఎంసీ(GHMC) దృష్టి సారించింది. కృత్రిమ కొలనుల ఏర్పాటుకు ఆసక్తి వ్యక్తీకరణ కోరుతూ బుధవారం టెండర్‌ నోటిఫికేషన్‌ ప్రకటించింది. 10 మీటర్ల వెడల్పు, 20 మీటర్ల పొడవు, 1.32 మీటర్ల లోతుతో ఉండే పీవీసీ పోర్టబుల్‌ పాండ్‌లు అవసరమని టెండర్‌లో పేర్కొంది. 2.36 లక్షల లీటర్ల నీరు పట్టే సామర్థ్యంతో కృత్రిమ కొలనులు ఏర్పాటు చేయనున్నారు.


మొదటి విడతగా సికింద్రాబాద్‌ జోన్‌(Secunderabad Zone) పరిధిలో 50 కొలనుల ఏర్పాటు కోసం బిడ్‌లు ఆహ్వానించారు. ఇతర జోన్లలోనూ అవసరాన్ని బట్టి కొలనులు ఏర్పాటు చేయనున్నట్టు ఇంజనీరింగ్‌ విభాగం అధికారొకరు తెలిపారు. ఆగస్టు 27న వినాయక చవితి ఉంది. నవరాత్రుల పూజల అనంతరం సెప్టెంబర్‌ 6వ తేదీన సామూహిక నిమజ్జనం జరిగే అవకాశముంది.


city5.2.jpg

వినాయక చవితి మరునాటి నుంచే నిమజ్జనాలు ప్రారంభం కానున్న దృష్ట్యా ఆగస్టు మూడో వారంలో కొలనులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. ఈ కొలనుల్లో ఐదు నుంచి ఆరు ఆడుగుల విగ్రహాలు నిమజ్జనం చేయవచ్చని ఓ అధికారి తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి.

12వ తరగతి బాలుడితో టీచరమ్మ బలవంతపు శృంగారం!

రేవంత్‌.. తెలంగాణకు పట్టిన అబద్ధాల వైరస్‌!

Read Latest Telangana News and National News

Updated Date - Jul 03 , 2025 | 08:47 AM