Road Accidents: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదాలు.. ముగ్గురు మృతి
ABN , Publish Date - Jul 03 , 2025 | 08:07 AM
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. ఈ ఘటనతో ఆయా కుటుంబాలు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయాయి. ఈ ప్రమాదాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

సంగారెడ్డి: కంది మండలం చేర్యాల గేటు వద్ద బధవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం (Road Accidents) జరిగింది. ఈ ప్రమాదంలో లారీని కారు ఢీ కొనడంతో ఫిల్మ్‌నగర్ ఎస్ఐ రాజేశ్వర్ మృతిచెందారు. ఎస్ఐని ఆస్పత్రికి తరలిస్తుండగానే మృతి చెందారు. బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద బందోబస్తు నిర్వహించి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్ఐ రాజేశ్వర్ సంగారెడ్డిలోని చాణక్యపురి కాలనీలో నివాసం ఉంటున్నారు. ఎస్ఐ మృతిచెందడంతో ఆ కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు మృతి
నిజామాబాద్ జిల్లాలోని పెద్ద కొడప్‌గల్ మండలం జగన్నాథ్‌పల్లి శివారులో 161వ జాతీయ రహదారిపై ఆగి ఉన్న కంటెయినర్‌ను ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ మరొకరిని చికిత్స నిమిత్తం బాన్సువాడ ఆస్పత్రికి తరలించారు. మృతులు జుక్కల్ మండలం మహమ్మదాబాద్‌కు చెందిన పోనుగంటి వెంకట్ (21), మంగలి గణేష్(19)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
బీజేపీ జూబ్లీహిల్స్ అభ్యర్థిపై నిర్ణయం తీసుకోలేదు
రేవంత్.. తెలంగాణకు పట్టిన అబద్ధాల వైరస్!
Read Latest Telangana News And Telugu News