Home » Nizamababad
Humanitarian Judge: బోధన కోర్టులో జడ్జి మానవత్వాన్ని చాటుకున్నారు. నడివలేని స్థితిలో ఉన్న వృద్ధ జంట పట్ల న్యాయమూర్తి వ్యవహరించిన తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Rythu Mahotsava Sabha: నిజామాబాద్‌లో సోమవారం నాడు రైతు మహోత్సవ సభ జరిగింది. ఈ సభకు హెలికాప్టర్‌లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, షబ్బీర్ అలీ వచ్చారు. ఈ సమయంలో హెలికాప్టర్ నుంచి వచ్చిన గాలితో సభ స్వాగత తోరణాలు కూలడంతో కొంతసేపు హై టెన్షన్ వాతావరణం నెలకొంది.
ఏప్రిల్ 27న వరంగల్‍లో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు రాకుండా తమ కార్యకర్తలను అడ్డుకుంటున్నారని ఎమ్మెల్సీ కవిత ఆగ్రహించారు. అలాంటి కాంగ్రెస్ నేతలను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.
నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తల్లి మరణవార్త తెలుసుకున్న షకీల్ దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు చేరుకుని శంషాబాద్‌లో అరెస్టయ్యారు
Kamareddy Car Accident: ఇద్దరు కానిస్టేబుల్‌లు అర్ధరాత్రి పెట్రోలింగ్ నిర్వహించి ఓ చోట రోడ్డు పక్కన నిల్చున్నారు. ఇంతలోనే అనుకోని ఘటన చోటు చేసుకుంది.
తెలంగాణలో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల స్థానంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రేపు ఉదయానికి తుది ఫలితం వచ్చే అవకాశం ఉంది. పోలింగ్ పూర్తైన తర్వాత బీఎస్పీ అభ్యర్థి గెలుస్తారని ప్రచారం జరిగింది. తాజాగా ట్రెండ్స్ చూస్తుంటే మాత్రం బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రధానపోటీ జరిగినట్లు తెలుస్తోంది.
బీదర్ వయా సికింద్రాబాద్‌గా నిజాముద్దీన్‌కు రెండు ప్రత్యేకరైళ్లను నడుపుతునట్లు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) ప్రకటించింది. ఈ నెల 26న బీదర్(Bidar) నుంచి ఉదయం 6 గంటలకు, తిరుగు ప్రయాణంలో మార్చి 1న నిజాముద్దీన్ నుంచి ఉదయం 7.45 లీగంటలకు ఈ ప్రత్యేక రైళ్లు (07223/ 07224) బయల్దేరుతాయని సీపీఆర్‌ఓ శ్రీధర్ వెల్లడించారు.
కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. సిటింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు పార్టీ అభ్యర్థి నరేందర్‌రెడ్డి తరఫున స్వయంగా ప్రచారం చేపట్టనున్నారు. సోమవారం ఒక్కరోజే ఏకంగా మూడు జిల్లాలు పర్యటించి ప్రచార సభల్లో పాల్గొంటున్నారు.
Kishan Reddy: కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. హామీల అమలుకు ప్రణాళిక, కార్యాచరణ ప్రకటిస్తే చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. ఏ ఒక్క హామీకి కనీసం కార్యచరణ కూడా లేదని విమర్శించారు.
నిజామాబాద్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడడం తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది. రెంజల్ మండలం సాటాపూర్ గ్రామానికి చెందిన గంగారం.. కుమారుడు, భార్యతో కలిసి గురువారం ఉదయం వ్యవసాయ పనుల నిమిత్తం బోధన్ మండలం పెగడపల్లి శివారుకు వెళ్లారు.