Nizamabad Crime: దారుణం.. రోడ్డుపై నగ్నంగా మొండెంతో మహిళ మృతదేహం
ABN , Publish Date - Nov 01 , 2025 | 10:10 AM
ఓ చేయి, మరో చేతి వేళ్ళు, తల తొలగించి ఆమెను అతి కిరాతకంగా హత్య చేశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు.
నిజామాబాద్, నవంబర్ 1: జిల్లాలో మహిళ మృతదేహం తీవ్ర కలకలం రేపుతోంది. నవీపేట మండలం ఫకీరాబాద్ మిట్టాపూర్ శివారులో తల లేని మహిళ డెడ్‌బాడీ (Women Deadbody) లభ్యమైంది. బాసర ప్రధాన రహదారి సమీపంలో నగ్నంగా మహిళ మృతదేహం పడి ఉంది. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు... ఓ చేయి, మరో చేతి వేళ్ళు, తల తొలగించి ఆమెను అతి కిరాతకంగా హత్య చేశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు.
అయితే మృతిచెందిన మహిళ ఎవరు?.. ఆమెను ఎక్కడో హత్య చేసి ఇక్కడ తీసుకొచ్చి పడేశారా?... డెడ్‌బాడీ నగ్నంగా ఉండటంతో అత్యాచారం ఏమన్నా జరిగిందా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. కేవలం మొండెం మాత్రమే కనిపించడంతో మహిళ తల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతురాలి వివరాలను సేకరించే పనిలో ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. త్వరలోనే మహిళకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించి తెలియజేస్తామని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు నగ్నంగా, తల లేకుండా మొండెం మాత్రమే ఉన్న మహిళ మృతదేహాన్ని చూసి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. నెల వ్యవధిలో జిల్లాలో ఇద్దరు మహిళలు దారుణ హత్యకు గురవడం తీవ్ర సంచలనంగా మారింది.
ఇవి కూడా చదవండి...
విజిలెన్స్‌లో ఏఐ టాస్క్‌ఫోర్స్..
రెండేళ్ల తర్వాత.. నగరానికి దక్కిన మంత్రి పదవి
Read Latest Telangana News And Telugu News