CP Sajjanar: విజిలెన్స్‌లో ఏఐ టాస్క్‌ఫోర్స్..
ABN , Publish Date - Nov 01 , 2025 | 10:00 AM
అవినీతి అక్రమాలు, నేరాలను నియంత్రించే క్రమంలో విజిలెన్స్ శాఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత టాస్క్‌ఫోర్సు ఏర్పాటు చేస్తే పారదర్శకత, ఉత్పాదకత పెరుగుతాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ అన్నారు.
- హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్
హైదరాబాద్ సిటీ: అవినీతి అక్రమాలు, నేరాలను నియంత్రించే క్రమంలో విజిలెన్స్ శాఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత టాస్క్‌ఫోర్సు ఏర్పాటు చేస్తే పారదర్శకత, ఉత్పాదకత పెరుగుతాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ అన్నారు. సైదాబాద్ సింగరేణి భవన్‌లో శుక్రవారం విజిలెన్స్ అవగాహన వారోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతి, అక్రమాలు తగ్గాలంటే వ్యవస్థలో మౌలిక మార్పులు అవసరమన్నారు.

సింగరేణి సంస్థతో తనకు 25 ఏళ్ల అనుబంధం ఉందన్నారు. జీఎస్టీ రంగారెడ్డి కమిషనరేట్ ప్రిన్సిపల్ కమిషనర్ జి.శ్రీనివాసరావు మాట్లాడుతూ విజిలెన్స్ అంటే శిక్షించే శాఖ కాదు, సంస్కరించే శాఖగా రూపుదిద్దుకోవాలన్నారు. సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో దేశంలోని 10 రాష్ర్టాల్లోనూ కార్యకలాపాలు నిర్వహించేలా,

అంతర్జాతీయంగా ఖనిజ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకునేలా విస్తరణ ప్రణాళికలు రూపొందించినట్లు వివరించారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు ఎల్వీ సూర్యనారాయణ, కె.వెంకటేశ్వర్లు, గౌతమ్ పొట్రు, తిరుమలరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూవ్‌మెంట్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ బి.వెంకన్న, జీఎం టి.శ్రీనివాస్, జీఎంలు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
డిగ్రీ విద్యార్థిని అనుమానాస్పద మృతి
Read Latest Telangana News and National News