Hyderabad: బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై కేసు నమోదు
ABN , Publish Date - Nov 01 , 2025 | 08:52 AM
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకు జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పై కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రగడ్డ సుల్తాన్ నగర్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థి ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి పేరు, ఫొటో ఉన్న ఓటరు గుర్తింపుకార్డు ప్రతులను నాయకులు పంపిణీ చేశారు.
హైదరాబాద్: ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకు జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత(Jubilee Hills BRS candidate Maganti Sunitha)పై కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రగడ్డ సుల్తాన్ నగర్(Erragadda Sultan Nagar)లో బీఆర్‌ఎస్ అభ్యర్థి ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి పేరు, ఫొటో ఉన్న ఓటరు గుర్తింపుకార్డు ప్రతులను నాయకులు పంపిణీ చేశారు. బీఆర్‌ఎస్ నేత పల్లా రాజేశ్వర్‌రెడ్డి(Palla Rajeshwar Reddy) ఆధ్వర్యంలో జరిగిన కార్డుల పంపిణీని గుర్తించిన కాంగ్రెస్ నాయకులు బోరబండ ఠాణాలో ఫిర్యాదు చేశారు.

దీనిపై న్యాయస్థానం సూచన మేరకు బోరబండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఎన్నికల ప్రచారం చేస్తున్న బీఆర్‌ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ అభ్యర్థి సోదరుడు వెంకట్ యాదవ్, అతడి అనుచరులు దౌర్జన్యం చేశారన్న ఫిర్యాదును బోరబండ పోలీసులు కోర్టు పరిశీలనకు పంపించారు. కోర్టు సూచన ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
డిగ్రీ విద్యార్థిని అనుమానాస్పద మృతి
Read Latest Telangana News and National News