సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న కూరగాయల ధరలు
ABN, Publish Date - Nov 22 , 2025 | 04:04 PM
గత రెండు రోజులుగా కూరగాయల ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. కూరగాయల ధరలు చూస్తే కొనలేని పరిస్థితి ఉందని ప్రజలు వాపోతున్నారు.
నిజామాబాద్, నవంబర్ 22: కూరగాయల ధరలు కొండెక్కి కూర్చుకున్నాయి. సామాన్యులకు కూరగాయల ధరలు చుక్కులు చూపిస్తున్నాయి. సగటు మానవుడు కూరగాయలు కొని తినలేని పరిస్థితి నెలకొంది. జిల్లా మార్కెట్‌లో ఒక్కో కూరగాయ ధరకిలో రూ.60గా పలుకుతోంది. గత రెండు రోజులుగా కూరగాయల ధరలు పెరుగుతూ వస్తున్నాయి. వర్షాల కారణంగా పంటలు దెబ్బ తినడం వల్ల కూరగాయల రేట్లు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. దీంతో రేట్లను కట్టడి చేయాలని ప్రజలు కోరుతున్న పరిస్థితి.
ఇవి కూడా చదవండి...
సైబర్ నేరాలపై అవగాహన, అప్రమత్తత ఉండాల్సిందే: సీపీ సజ్జనార్
ఇది మంచి పరిణామం: డిప్యూటీ సీఎం భట్టి
Read Latest Telangana News And Telugu News
Updated at - Nov 22 , 2025 | 04:12 PM