Share News

AV Ranganath: 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలి..

ABN , Publish Date - Jul 03 , 2025 | 09:35 AM

సిటీ: వర్షాకాల అత్యవసర బృందాలు 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌(Hydra Commissioner AV Ranganath) సూచించారు. వాతావరణ శాఖ సూచనల ఆధారంగా ముందుగానే సన్నద్ధం కావాలని సూచించారు.

AV Ranganath: 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలి..

- అత్యవసర బృందాల కాంట్రాక్టర్ల సమావేశంలో రంగనాథ్‌

హైదరాబాద్‌ సిటీ: వర్షాకాల అత్యవసర బృందాలు 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌(Hydra Commissioner AV Ranganath) సూచించారు. వాతావరణ శాఖ సూచనల ఆధారంగా ముందుగానే సన్నద్ధం కావాలని సూచించారు. అత్యవసర బృందాలు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో బుధవారం కాంట్రాక్టర్లు, హైడ్రా మార్షల్స్‌, డీఆర్‌ఎఫ్‌ మేనేజర్లు, సూపర్‌వైజర్లతో సమావేశం నిర్వహించారు.


city6.2.jpg

ఈ సందర్భంగా రంగనాథ్‌ మాట్లాడుతూ.. వర్షం పడితే నగరంలో ఎక్కడ ఎలాంటి సమస్యలు తలెత్తుతాయనే దానిపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, పరిష్కార చర్యలు ఏంటన్నదీ తెలిసి ఉండాలన్నారు. జీహెచ్‌ఎంసీ(GHMC), వాటర్‌బోర్డు, హైడ్రా, ఇరిగేషన్‌ తదితర విభాగాలతో సమన్వయం చేసుకుంటు ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడడమే లక్ష్యం కావాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు ఫిర్యాదు చేసినప్పుడు వాటిని పరిష్కరించడంలో బాధ్యతగా వ్యవహరించాలని రంగనాథ్‌ సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి.

12వ తరగతి బాలుడితో టీచరమ్మ బలవంతపు శృంగారం!

రేవంత్‌.. తెలంగాణకు పట్టిన అబద్ధాల వైరస్‌!

Read Latest Telangana News and National News

Updated Date - Jul 03 , 2025 | 09:35 AM