ACB Raids On Ex ENC: మాజీ ఈఎన్‌సీ నివాసంలో ఏసీబీ రైడ్స్
ABN , Publish Date - Jul 15 , 2025 | 11:54 AM
ACB Raids On Ex ENC: హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్ ప్రాంతాల్లో 10 చోట్ల సోదాలు జరుగుతున్నాయి. మురళీధర్ కుటుంబసభ్యులు, బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో భారీగా అక్రమస్తులను ఏసీబీ గుర్తించినట్లు సమాచారం.

హైదరాబాద్, జులై 15: ఇరిగేషన్ శాఖలో అక్రమాలపై ఏసీబీ (ACB) దృష్టి సారించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో గతంలో కీలకంగా పనిచేసిన అధికారుల అవినీతిపై ఏసీబీ నజర్ పెట్టింది. ఇప్పటికే కాళేశ్వరం మాజీ ఈఎన్సీ హరీ రామ్.. ఈఈ నూనె శ్రీధర్‌లను ఏసీబీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా మాజీ ఈఎన్‌సీ మురళీధర్ రావు (Ex-ENC Muralidhar Rao) ఇంట్లో ఏసీబీ అధికారుల సోదాలు (ACB Raids) కొనసాగుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో మురళీధర్ కీలకంగా వ్యవహారించారు. బంజారాహిల్స్‌లోని ఆయన నివాసంలో ఈరోజు (మంగళవారం) ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి.
హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్ ప్రాంతాల్లో 10 చోట్ల సోదాలు జరుగుతున్నాయి. మురళీధర్ కుటుంబసభ్యులు, బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో భారీగా అక్రమస్తులను ఏసీబీ గుర్తించినట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్ట్ సబ్ కాంట్రాక్ట్‌ల కేటాయింపుల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు గుర్తించింది ఏసీబీ. ఇప్పటికే హరీ రామ్.. నూనె శ్రీధర్ల సోదాల్లో వందల కోట్ల అక్రమస్తులు ఉన్నట్లు ఏసీబీ బయటపెట్టింది. ఇక.. మాజీ ఈఎన్‌సీ మురళీధర్ రావును కాళేశ్వరం కమిషన్ విచారించింది. కమిషన్ విచారణలో తనకు తెలియదు, మర్చిపోయాను అంటూ మురళీధర్ సమాధానం చెప్పారు. విజిలెన్స్ నివేదికలో మాజీ ఈఎన్‌సీ మురళీధర్ రావు పేరును కూడా చేర్చారు. ఈ క్రమంలో ఈ రోజు సాయంత్రం వరకు ఏసీబీ సోదాలు కొనసాగే అవకాశం ఉంది. అనంతరం మురళీధర్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకోనున్నారు.
ఇవి కూడా చదవండి..
కాంగ్రెస్ నేత హత్య కేసులో కీలక విషయాలు
బనకచర్లపై చర్చ అనవసరం.. తేల్చేసిన తెలంగాణ సర్కార్
Read latest Telangana News And Telugu News