Home » ACB
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం ద్వారా పట్టుబడిన రూ.11 కోట్లు బ్యాంకులో సిట్ అధికారులు శనివారం డిపాజిట్ చేశారు. ఆ నోట్లను వీడియో తీయాలని, విడిగానే ఉంచాలని ఏసీబీ కోర్టులో రాజ్ కసిరెడ్డి తరపు న్యాయవాదులు పిటీషన్ వేశారు.
ప్రభుత్వ కార్యాలయాలకు పని నిమిత్తం వచ్చే వారిని లంచాలు అడుగుతున్న అక్రమార్కులకు ఏసీబీ గట్టి షాక్ ఇస్తోంది. జూలైలో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి పలువురు లంచగొండుల ఆటకట్టించింది.
మద్యం కుంభకోణం కేసులో 12 మంది నిందితులు శుక్రవారం ఏసీబీ కోర్టులో హాజరయ్యారు. తమకు బెయిల్ కావాలని వీరు న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేశారు. నిందితులు వేసిన పిటిషన్లపై న్యాయస్థానం ఇవాళ విచారణ చేపట్టింది. నిందితుల పిటిషన్లని కోర్టు వాయిదా వేసింది. ఈ సందర్భంగా 12 మంది నిందితులకు ఈనెల13వ తేదీ వరకు ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగించింది.
నీటిపారుదల శాఖ విశ్రాంత ఇంజనీర్ చీటి మురళీధర్ రావు అక్రమాస్తుల కేసులో ఏసీబీ అధికారులు గురువారం బ్యాంకు లాకర్లను పరిశీలించారు.
వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి లాయర్లు ఏసీబీ కోర్టులో గురువారం బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. లిక్కర్ స్కాం కేసులో ఏ4గా మిథున్‌రెడ్డి ఉన్నారు.
రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దాడులు, సోదాలు కొనసాగుతున్నా.. లంచాలకు అలవాటు పడిన అధికారుల తీరు మారట్లేదు. 16 గుంటల భూమికి పట్టా పాస్ బుక్ జారీ చేసేందుకు రూ.2 లక్షలు లంచం డిమాండ్..
రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతిపై ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. గురువారం బీబీనగర్, సదాశివపేట, జడ్చర్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆకస్మిక సోదాలు జరిపి భారీగా అక్రమాలు జరుగుతున్నట్లు గుర్తించారు.
ఇద్దరు ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్‌సీ)లు, ఒక ఈఈ.. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగస్వాములైన ఈ ముగ్గురూ అక్రమాస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు పట్టుబడ్డారు.
ACB Raids On Ex ENC: హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్ ప్రాంతాల్లో 10 చోట్ల సోదాలు జరుగుతున్నాయి. మురళీధర్ కుటుంబసభ్యులు, బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో భారీగా అక్రమస్తులను ఏసీబీ గుర్తించినట్లు సమాచారం.
ఓ రైతు వద్ద లంచం తీసుకుంటూ నిమ్జ్ (నేషనల్ ఇన్వె్‌స్టమెంట్, మాన్యుఫాక్చరింగ్ జోన్స్) స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజిరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ సతీష్, డ్రైవర్ దుర్గయ్య ఏసీబీకి పట్టుబడ్డారు.