ACB raids: సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లపై ఏసీబీ దాడులు, భారీగా నగదు పట్టివేత
ABN , Publish Date - Nov 15 , 2025 | 06:32 PM
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు చేస్తోంది. మొత్తం 23 టీమ్స్‌తో ఇవాళ (శనివారం)సోదాలు జరిపారు. గండిపేట్, శేరిలింగంపల్లి, మేడ్చల్, నిజామాబాద్ టౌన్, జహీరాబాద్..
ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు చేస్తోంది. మొత్తం 23 టీమ్స్‌తో ఇవాళ (శనివారం)సోదాలు జరిపారు. గండిపేట్, శేరిలింగంపల్లి, మేడ్చల్, నిజామాబాద్ టౌన్, జహీరాబాద్, మిర్యాలగూడ, వనపర్తి, మంచిర్యాల్, పెదపల్లి, భూపాలపల్లి, వైరాలో ఏసీబీ దాడులు నిర్వహించింది.
ఈ సోదాల్లో రూ. 2,51,990 అకౌంటింగ్ లేని డబ్బు సీజ్ చేసింది ఏసీబీ. 289 రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు, కార్యాలయాల్లో నగదు స్వాధీనం చేసుకుంది. 19 మంది ప్రైవేట్ వ్యక్తులు, 60 మంది డాక్యుమెంట్ రైటర్లు.. అనుమతి లేకుండా కార్యాలయాల్లో వ్యవహారాలు నడుపుతూ అవినీతికి పాల్పడినట్లు ACB గుర్తించింది.
చాలా కార్యాలయాల్లో CCTV కెమెరాలు పని చేయనట్లు కూడా ఏసీబీ గుర్తించింది. లోపాలపై ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. అటు, SRO ఇళ్లలో కూడా ఏసీబీ సోదాలు చేసింది. ఇలా మొత్తం 13 మంది SROల ఇళ్లలో సోదాలు జరిపి, నగదు, ఆభరణాలు, ప్రాపర్టీ పత్రాలు స్వాధీనం చేసుకుంది.

ఇవి కూడా చదవండి..
రాజకీయాలకు గుడ్‌బై.. లాలూ కుమార్తె సంచలన ప్రకటన
కేంద్ర మాజీ మంత్రిని సస్పెండ్ చేసిన బీజేపీ
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.