Share News

MP Mithun Reddy: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట

ABN , Publish Date - Oct 17 , 2025 | 06:51 PM

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట లభించింది. ఈనెల 23వ తేదీ నుంచి వచ్చే నెల నాలుగో తేదీ వరకు న్యూయార్క్ వెళ్లడానికి షరతులతో కూడిన అనుమతిని విజయవాడ ఏసీబీ కోర్టు జారీ చేసింది.

MP Mithun Reddy: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట
MP Mithun Reddy

విజయవాడ, అక్టోబరు17 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి (YSRCP MP Mithun Reddy)కి ఊరట లభించింది. ఈనెల 23వ తేదీ నుంచి వచ్చే నెల నాలుగో తేదీ వరకు న్యూయార్క్ (NewYork Trip) వెళ్లడానికి షరతులతో కూడిన అనుమతిని విజయవాడ ఏసీబీ కోర్టు (Vijayawada ACB court) జారీ చేసింది. రూ.50,000 విలువచేసే రెండు జామీన్లను కోర్టులో సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.


న్యూయార్క్‌లో ఎక్కడ బస చేస్తున్నారనే వివరాలను అందజేయాలని ఆజ్ఞాపించింది న్యాయస్థానం. మిథున్ రెడ్డి ఈమెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్లను కోర్టుకు వెంటనే తెలియజేయాలని ఆదేశించింది. మిథున్ రెడ్డి న్యూయార్క్‌ పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే పాస్ పోర్టుని సిట్ అధికారులకు అప్పగించాలని షరతులు విధించింది. న్యూయార్క్ వెళ్లడానికి బుక్ చేసిన విమానం టికెట్ల ఫొటో కాపీలను కోర్టులో సమర్పించాలని విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి...

సామాన్యులకు ఉపయోగపడేలా పోస్టల్, బీఎస్ఎన్ఎల్ సంస్థల పురోగతి: పెమ్మసాని

జగన్ హయాంలో సాగునీటి ప్రాజెక్టులు విధ్వంసం

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 17 , 2025 | 07:23 PM