Shamshabad Airport: ప్రయాణికులకు గమనిక.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు రెడ్ అలెర్ట్
ABN , Publish Date - Aug 02 , 2025 | 09:37 PM
శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు నిఘా వర్గాల అధికారులు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. ఆగస్టు 15వ తేదీను పురస్కరించుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు (Shamshabad Airport) నిఘా వర్గాల అధికారులు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. ఆగస్టు 15వ తేదీను పురస్కరించుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ప్రయాణికుల భద్రతా రీత్యా ఎయిర్ పోర్టుకు సందర్శకుల అనుమతులను నిలిపివేశారు. అనుమానితుల పట్ల సీఐఎస్ఎఫ్ సెక్యూరిటీ అధికారులు నిఘా ఉంచారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ చుట్టూ ఉన్న ప్రహారీని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు భద్రతా సిబ్బంది. ఎయిర్ పోర్టులో సీఐఎస్ఎఫ్, రక్షణ సెక్యూరిటీ, స్థానిక పోలీసులు సముక్తంగా తనిఖీలు నిర్వహించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కాంగ్రెస్ మాత్రమే మోదీని కుర్చీ నుంచి దింపగలదు: రేవంత్‌రెడ్డి
ప్రభుత్వ సొమ్ము తిన్నవాళ్లను తిరిగి కక్కిస్తాం.. మహేష్ గౌడ్ స్ట్రాంగ్ వార్నింగ్
Read latest Telangana News And Telugu News