Home » Shamshabad
మొయినాబాద్ డ్రగ్స్ కేసు విచారణలో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రత్యేక విచారణ బృందం ముగ్గురు నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తుండగా, ఈ కేసులో రోహిత్ రెడ్డి, డ్రగ్స్ పెడ్లర్ అభిషేక్ సింగ్ పాత్రపై కీలక ఆధారాలు లభించాయి.
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతా అధికారులు ఒక పెను ప్రమాదాన్ని అడ్డుకున్నారు. శంషాబాద్ నుంచి కేరళం వెళ్లేందుకు సిద్ధమైన ఒక ప్రయాణికుడి బ్యాగేజీలో బుల్లెట్లు బయటపడటంతో అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి వివిధ దేశాలకు వెళ్లాల్సిన పలు అంతర్జాతీయ విమానాలు రద్దు అయ్యాయి. మిడిల్ ఈస్ట్‌లో కొనసాగుతున్న ఇరాన్ - ఇజ్రాయిల్ యుద్ధ పరిస్థితుల కారణంగా విమానాలు రద్దు అయ్యాయని ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు.
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి విదేశాలకు వెళ్లాల్సిన అనేక విమానాలు రద్దు అయ్యాయి.
ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం పడింది. ముఖ్యంగా హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన విమాన సర్వీసులు భారీగా రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
శంషాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్, పహాడీషరీఫ్ పోలీసులు జరిపిన జాయింట్ ఆపరేషన్‌లో కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ తయారీ ముఠా గుట్టురట్టు చేశారు. ఈ దాడులు జల్‌పల్లిలోని ఎస్కే రాయల్ ఎంటర్‌ప్రైజెస్, షాహీ గోల్డ్ కంపెనీలపై నిర్వహించారు.
సింగపూర్ నుంచి వచ్చే విమానానికి బాంబు బెదిరింపు రావడంతో.. శంషాబాద్ ఎయిర్ పోర్టు అధికారులు అప్రమత్తమయ్యారు. విమానం సురక్షితంగా ల్యాండ్ కాగానే.. ప్రయాణికులను దింపిన తర్వాత భద్రతా సిబ్బంది తనిఖీలు చేపట్టారు.
శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు పెరిగిపోతున్నాయి. తాజాగా మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి. గల్ఫ్ ఎయిర్‌లైన్స్ విమానానికి బెదిరింపు మెయిల్ వచ్చింది. వెంటనే ఎయిర్‌పోర్టు అధికారులు అప్రమత్తం అయ్యారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రాయపూర్‌కు వెళ్లాల్సిన ఇండిగో విమానం నిలిచిపోయింది. టేకాఫ్ సమయంలో విమానంలో లోపాన్ని పైలెట్ గుర్తించారు..
తిరుపతి నుంచి శంషాబాద్ వచ్చిన ఓ వ్యక్తి బ్యాగ్‌లో సీఐఎస్ఎఫ్ సెక్యూరిటీ అధికారులు బుల్లెట్‌ను గుర్తించారు. విచారణ నిమిత్తం ఆ వ్యక్తిని ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించారు.