HarishRao: అలా చెబుతూ రేవంత్‌రెడ్డి పరువు తీసుకుంటున్నారు.. హరీష్‌రావు వ్యంగ్యాస్త్రాలు
ABN , Publish Date - May 21 , 2025 | 09:05 PM
HarishRao: సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి హరీష్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో రేవంత్‌రెడ్డి విఫలం అయ్యారని హరీష్‌రావు మండిపడ్డారు.

సంగారెడ్డి జిల్లా: తెలంగాణ రాష్ట్రాన్ని పాలించడంలో రేవంత్ సర్కార్ విఫలమైందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు (HarishRao) ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి (CM Revanth Reddy) ధరలు పెంచడం తప్ప.. ప్రజలకు పంచడం తెలియదని విమర్శించారు. వానకాలం సమీపిస్తున్న పచ్చిరొట్టె విత్తనాల పంపిణీ జాడలేదని అన్నారు. మూడు సీజన్లుగా రైతుబంధు ఖాతాలో జమ కావడం లేదని చెప్పారు. రైతు బీమా కోసం ప్రభుత్వం మూడు నెలలుగా ప్రీమియం ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు. ఎరువులు, విత్తనాలతో సహా మద్యం ధరలు రేవంత్ సర్కార్ పెంచేసిందని ధ్వజమెత్తారు. ఇవాళ(బుధవారం) జహీరాబాద్‌లో హరీష్‌రావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మీడియాతో మాట్లాడారు.
ఢిల్లీ పర్యటనలో తనను చెప్పులు ఎత్తుకెళ్లే వాడిలా చూస్తున్నారని చెబుతూ రేవంత్‌రెడ్డి పరువు తీసుకుంటున్నారని మాజీ మంత్రి హరీష్‌రావు విమర్శించారు. సంగారెడ్డి జిల్లాలో జొన్నలు కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో ఎందుకు నయా పైసా జమ చేయలేదని నిలదీశారు. బోనస్ డబ్బులు చెల్లిస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రకటిస్తున్నా.. ఎక్కడ అన్నదాతల ఖాతాలో జమ కావడం లేదని గుర్తుచేశారు. వానాకాలం సీజన్లో రైతులకు జనుము, జీలుగా విత్తనాలు వెంటనే పంపిణీ చేయాలని మాజీ మంత్రి హరీష్‌రావు డిమాండ్ చేశారు.
రైతులకు అవసరమైన అన్నిరకాల ఎరువులను వెంటనే సిద్ధంగా ఉంచాలని మాజీ మంత్రి హరీష్‌రావు కోరారు. జహీరాబాద్ ప్రాంతానికి ఏం చేశారని సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనకు వస్తున్నారని ప్రశ్నించారు. రైల్వే ఓవర్ బ్రిడ్జి, నిమ్జ్ రోడ్డు, బసవేశ్వర విగ్రహం అన్ని కేసీఆర్ హయాంలో జరిగినవేనని గుర్తుచేశారు. కేంద్రీయ విద్యాలయంలో తరగతులు కొనసాగుతుంటే.. ఇప్పుడు ఎలా ప్రారంభిస్తారని నిలదీశారు. సంగమేశ్వర, బసవేశ్వర పథకాలకు సీఎం రేవంత్‌రెడ్డి నిధులు కేటాయించాలని మాజీ మంత్రి హరీష్‌రావు డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
Minister Uttam Kumar Reddy: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తప్పిన ప్రమాదం
CM Revanth Reddy: పాక్‌కి బుద్ది చెప్పడంలో ప్రధాని వెనకడుగు..
Miss World contestants: రొమ్ము క్యాన్సర్ అవగాహనలో మిస్ వరల్డ్ బ్యూటీస్ తోడ్పాటు
Heavy Rain: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం
Read latest Telangana News And Telugu News