TG News: హైదరాబాద్‌లో బోనాల పండుగ పూట విషాదం
ABN , Publish Date - Jul 22 , 2025 | 08:12 PM
వనస్థలిపురంలో బోనాల పండుగ పూట విషాదం నెలకొంది.. ఆషాఢ మాస చివరి ఆదివారం బోనాల పండుగకు తెచ్చుకున్న మాంసం తిని కుటుంబ సభ్యులు ఆస్పత్రి పాలయ్యారు. వనస్థలిపురం ఆర్టీసీ కాలనిలో ఎనిమిది మంది ఫుడ్ పాయిజన్‌కి గురయ్యారు.

హైదరాబాద్: వనస్థలిపురంలో బోనాల పండుగ పూట విషాదం నెలకొంది.. ఆషాఢ మాస చివరి ఆదివారం బోనాల పండుగకు తెచ్చుకున్న మాంసం తిని కుటుంబ సభ్యులు ఆస్పత్రి పాలయ్యారు. వనస్థలిపురం ఆర్టీసీ కాలనీలో ఎనిమిది మంది ఫుడ్ పాయిజన్‌కి గురయ్యారు. బోనాల పండుగ సమయంలో తెచ్చుకున్న మాంసం చికెన్, బోటిని ఫ్రిజ్‌లో పెట్టుకొని తిన్నారు కుటుంబ సభ్యులు.
మాంసం తిన్న తర్వాత వాంతులు, విరోచనాలతో ఆస్పత్రుల పాలయ్యారు కుటుంబ సభ్యులు. వెంటనే వీరిని చింతల కుంట హిమాలయ ఆస్పత్రికి తరలించారు. వీరిలో రజిత (38), జశ్విత (15), గౌరమ్మ (65), లహరి (17), సంతోష్ కుమార్ (39), రాధిక (38), బేబీ కృతంగా (7) ఉన్నారు. ఎనిమిది మందిలో ఆర్టీసీ ఉద్యోగి శ్రీనివాస్ అక్కడికక్కడే మృతిచెందాడు. మిగతా ఏడుగురికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఏడుగురు కుటుంబ సభ్యుల పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బీసీల రిజర్వేషన్లపై కాంగ్రెస్, బీజేపీ కుట్ర చేస్తున్నాయి.. కవిత ఫైర్
Read Latest Telangana News and National News