Home » Bonalu Festival
వనస్థలిపురంలో బోనాల పండుగ పూట విషాదం నెలకొంది.. ఆషాఢ మాస చివరి ఆదివారం బోనాల పండుగకు తెచ్చుకున్న మాంసం తిని కుటుంబ సభ్యులు ఆస్పత్రి పాలయ్యారు. వనస్థలిపురం ఆర్టీసీ కాలనిలో ఎనిమిది మంది ఫుడ్ పాయిజన్‌కి గురయ్యారు.
నిత్యం పొలిటికల్ ప్రసంగాలు, ప్రత్యర్థి పార్టీలకు కౌంటర్లు ఇచ్చే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కొత్త పాత్రలో కనిపించారు. సంగారెడ్డిలో ఆదివారం రాత్రి అట్టహాసంగా నిర్వహించిన బోనాల జాతర వేదికగా యువతకు హితబోధ చేశారు.
శివసత్తుల ఊరేగింపులు, పోతరాజుల విన్యాసాలు, తీన్మార్ డప్పులతో స్టెప్పులు, మంగళ వాయిద్యాలు, కోలాటాలు, జానపద గీతాలు.. ఎటు చూసినా భక్త జనసందోహం, సందడే సందడి... వెరసి భాగ్యనగరం ఆదివారం ఆషాడ బోనల జాతర శోభ సంతరించుకుంది.
లాల్ దర్వాజాలో బోనాల సంబురాలు జోరుగా సాగుతున్నాయి. ఆలయ ప్రాంగణం అమ్మవారి పాటలతో హోరెత్తిపోతోంది. సింగర్ మధుప్రియ పాటకు జోగిని శ్యామల స్టెప్పులు వేయడం హైలెట్ గా నిలిచింది.
ఆషాఢ మాసం పూర్తి కావస్తుండటంతో భాగ్యనగరంలో బోనాల సంబురాలు అంబరాన్ని తాకుతున్నాయి. లాల్ దర్వాజాలో అమ్మవారి బోనాల ఉత్సవాలు జోరుగా సాగుతున్నాయి.
బోరబండ పోచమ్మ బోనాల ఉత్సవాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి ఆదివారం పాల్గొన్నారు. అమ్మవారికి బోనాలను విజయశాంతి సమర్పించారు. అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు విజయశాంతిని ఘనంగా సత్కరించారు. బోరబండ బోనాల వేడుకల్లో విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు.
బోనాల సంస్కృతి నాశనం చేయడానికి చాలా కాలంగా కుట్ర జరుగుతోందని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. ‘బోనాలపై తాగి ఆడే బోనాలు’ అని కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ప్రచారం తప్పు అని.. బోనాలపై కుట్ర జరుగుతోందని చెప్పుకొచ్చారు.
బోనాలు తెలంగాణ సంస్కృతిలో అనాదిగా కొనసాగుతూ వస్తున్నాయని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. గోల్కొండలో మొదలైన ఉత్సవాలు, సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల వరకు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. ఆదివారం లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారిని మల్లు భట్టి విక్రమార్క దర్శించుకున్నారు.
లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు ఇవాళ ఆదివారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారికి బోనాలని సమర్పించడానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఆలయానికి భక్తులు క్యూ కట్టడంతో పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. బోనాలతో వచ్చే భక్తులకు ఆలయ అధికారులు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు.
నాల వేడుకల సందర్భంగా భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఆయా ఆలయాల పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 20, 21వ తేదీల్లో ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు.