Bonala festival: బోనాల సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు.. 20, 21వ తేదీల్లో అమల్లోకి..
ABN , Publish Date - Jul 19 , 2025 | 08:28 AM
నాల వేడుకల సందర్భంగా భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఆయా ఆలయాల పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 20, 21వ తేదీల్లో ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు.

హైదరాబాద్ సిటీ: బోనాల వేడుకల సందర్భంగా భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఆయా ఆలయాల పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్(City Traffic Joint Commissioner Joel Davis) శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 20, 21వ తేదీల్లో ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు.
లాల్ దర్వాజా ఆలయం పరిసరాల్లో..
సింహవాహిని మహంకాళి లాల్ దర్వాజా ఆలయంలో ఈనెల 21న నిర్వహించే బోనాల సందర్భంగా ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఆలయ పరిసరాల్లో సాధారణ వాహనాలకు అనుమతి ఉండదు. ఇంజన్‌బౌలి, ఫలక్‌నుమా వైపు నుంచి ఆలియాబాద్ వైపుకు వచ్చే వాహనాలను న్యూ షంషేర్‌గంజ్ నుంచి గోశాల, మిస్రీగంజ్ వైపునకు మళ్లీస్తారు. మహబూబ్‌నగర్ క్రాస్‌రోడ్ నుంచి ఆలియాబాద్ వైపునకు వచ్చే వాహనాలను ఇంజన్‌బౌలి నుంచి జమనుమా, గోశాల వైపునుకు డైవర్ట్ చేస్తారు. నాగులచింత, సుధాటాకీస్ వైపు నుంచి లాల్‌దర్వాజా వైపునకు వచ్చే వాహనాలను గౌలిపురా వైపునకు పంపుతారు. చార్మినార్ వైపు నుంచి నల్లచింత వైపుకు వచ్చే వాహనాలను హరిబౌలి, ఓల్గా హోటల్ వైపునకు మళ్లిస్తారు. ఇంకా పలు రూట్లలో ట్రాఫిక్ డైవర్ట్ చేస్తున్నామని’’ అని తెలిపారు.
పార్కింగ్ ప్రాంతాలు:
ఆలయానికి వచ్చే భక్తుల వాహనాలను నిలిపేందుకు షాలిబండ ప్రధాన రోడ్‌పై, ఆర్యవైశ్యమందిర్, వీడీపీ స్కూల్ గ్రౌండ్, మిత్రా స్పోర్ట్స్ క్లబ్, చార్మినార్ బస్‌టర్మినల్, ఢిల్లీగేట్ వద్ద పార్కింగ్ ఏర్పాట్లు చేశామన్నారు.
అంబర్‌పేట్ మహంకాళి ఆలయ పరిసరాల్లో....
ఉప్పల్ నుంచి చాదర్‌ఘాట్, ఎంజీబీఎస్ వైపుకు వెళ్లే భారీ వాహనాలు, సిటీ బస్సులు, ఆర్టీసీ బస్సులను అంబర్‌పేట్ ఫ్లైఓవర్ పైనుంచి పంపుతారు.
చిలకలగూడ కట్టమైసమ్మ పోచమ్మ టెంపుల్ పరిసరాల్లో..
చిలకలగూడ కట్టమైసమ్మ పోచమ్మ ఆలయ పరిసరాల్లో ఆదివారం, సోమవారం రోజుల్లో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు సాధారణ వాహనాలకు అనుమతి లేదు.
ఈ వార్తలు కూడా చదవండి.
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News