Share News

ED interrogation ON Prakash Raj: ప్రకాశ్‌రాజ్‌ను విచారిస్తున్న ఈడీ.. వెలుగులోకి సంచలన విషయాలు

ABN , Publish Date - Jul 30 , 2025 | 01:36 PM

బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ అధికారులు సినీ నటుడు ప్రకాష్‌రాజ్‌‌కు నోటీసులు ఇవ్వడంతో బుధవారం విచారణకు హాజరయ్యారు. ప్రకాష్‌రాజ్‌ను మూడు గంటలుగా ఈడీ అధికారులు విచారిస్తున్నారు. దుబాయ్‌కి చెందిన బెట్టింగ్ యాప్స్ నుంచి ట్రాన్సాక్షన్ జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు.

ED interrogation  ON Prakash Raj: ప్రకాశ్‌రాజ్‌ను విచారిస్తున్న ఈడీ..  వెలుగులోకి సంచలన విషయాలు
ED interrogation ON Prakash Raj

హైదరాబాద్: బెట్టింగ్ యాప్స్ కేసులో (Betting Apps Case) ఈడీ అధికారులు సినీ నటుడు ప్రకాష్‌రాజ్‌‌కు (Prakash Raj) నోటీసులు ఇవ్వడంతో ఇవాళ(బుధవారం జులై 30) విచారణకు హాజరయ్యారు. ప్రకాష్‌రాజ్‌ను మూడు గంటలుగా ఈడీ అధికారులు విచారిస్తున్నారు. దుబాయ్‌కి చెందిన బెట్టింగ్ యాప్స్ నుంచి ట్రాన్సాక్షన్ జరిగినట్లు గుర్తించారు. ప్రకాష్‌రాజ్ స్టేట్‌మెంట్ రికార్డ్ చేస్తున్నారు. దుబాయ్ నుంచి ఆపరేట్ అవుతున్న బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేశారు ప్రకాష్‌రాజ్. సినీ ప్రముఖులకు బెట్టింగ్ యాప్స్ ద్వారా వచ్చిన సొమ్మును దుబాయ్‌లోనే పెట్టుబడులు పెట్టినట్లు అనుమానిస్తున్నారు ఈడీ అధికారులు.


అయితే, ఐదు సంవత్సరాల ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తున్నారు. తన బ్యాంకు స్టేట్‌మెంట్‌లను ఈడీకి అందజేశారు ప్రకాష్‌రాజ్. జంగిల్ రమ్మీ ద్వారా భారీగా ప్రకాష్‌రాజ్ లాభపడినట్లు గుర్తించారు. జంగిల్ రమ్మి యాప్ ద్వారా వచ్చిన నగదుపై స్టేట్‌మెంట్ రికార్డ్ చేస్తున్నారు. గతంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌పై క్లారిటీ ఇచ్చారు ప్రకాష్ రాజ్. జంగిల్ రమ్మీతో కాంట్రాక్ట్ పూర్తి అయ్యాక.. మళ్లీ రెన్యూవల్ చేయలేదని.. మళ్లీ ఇంకెప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయనని చెప్పుకొచ్చారు ప్రకాష్‌రాజ్. ఇవాళ సాయంత్రం వరకు ప్రకాష్‌రాజ్‌ను ఈడీ అధికారులు విచారించే అవకాశాలు ఉన్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

బెట్టింగ్ యాప్స్ కేసులో ప్రకాష్‌రాజ్‌కు ఈడీ నోటీసులు.. ఇవాళ విచారణకు హాజరు

గుడ్ న్యూస్.. రేవంత్ ప్రభుత్వం మరో కీలకనిర్ణయం.. వాటికి గ్రీన్ సిగ్నల్

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 30 , 2025 | 01:43 PM