Home » Tollywood
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో సినీ నటులు చిరంజీవి, నాగార్జునలతో పాటు పలువురు ప్రముఖులు శనివారం ప్రజాభవన్‌లో సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై భట్టితో చర్చించారు.
చిత్రపురి కాలనీ అక్రమాల కేసులో నివేదికపై సినీ నిర్మాత తమ్మారెడ్డి భరజ్వాద స్పందించారు. గతంలో చిత్రపురి కమిటీలో సభ్యుడిగా ఉన్నందుకే తన పేరు నివేదికలో ఉందని చెప్పారు. తానేమీ డబ్బులు తినలేదని అన్నారు. అది తన బాధ్యతారాహిత్యంగా భావిస్తున్నానని చెప్పారు.
ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవి కేసుపై నాంపల్లి కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. నిందితుడు రవిని మూడోసారి కస్టడీకి అనుమతి ఇవ్వాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పిటిషన్లు దాఖలు చేశారు. అలాగే మరో నాలుగు కేసుల్లో కస్టడీ కోరుతూ పోలీసులు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.
టాలీవుడ్ హీరో ధర్మ మహేశ్ భార్య గౌతమి చౌదరిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో సోమవారం బిగ్‌బాస్ ఫేమ్ ఆర్జే శేఖర్ బాషా ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు గౌతమి చౌదరిపై కేసు నమోదు చేశారు పంజాగుట్ట పోలీసులు.
తెలుగు సినీ పరిశ్రమను పట్టిపీడిస్తున్న పైరసీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మది రవినీ హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు రెండోసారి కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఆన్‌లైన్‌లో పైరసీ వెబ్‌సైట్ల దందా ఆగడం లేదు. మూవీరూల్జ్‌లో ఒక్క రోజులోనే కొత్త సినిమాలు ప్రత్యక్షమయ్యాయి. శుక్రవారం రిలీజైన అన్ని సినిమాలను పైరసీ చేశారు.
ఇటీవల బెట్టింగ్ యాప్‌ల బారిన పడి పలువురు యువకులు ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన ప్రముఖులను సీఐడీ సిట్ అధికారులు వరుసగా విచారిస్తున్నారు. ఈ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.
తెలుగు సినిమా రక్షణలో హైదరాబాద్ సీపీ సజ్జనార్ చర్యలు కీలకమైనవని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశంసించారు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టు స్వాగతించదగ్గ పరిణామమని పేర్కొన్నారు.
భారత్ ఫ్యూచర్ సిటీలో సినీ పరిశ్రమకు ప్రాధాన్యం ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సినీ కార్మికుల పిల్లల కోసం కార్పొరేట్ స్థాయి పాఠశాలలు నిర్మిస్తానని సీఎం రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు.
మెగాస్టార్ చిరంజీవి ఫొటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల వీడియోలుగా మార్చి వెబ్‌సైట్లు, సోషల్ మీడియాలో దుండగులు పోస్ట్ చేశారు. దీంతో అవి వైరల్‌గా మారాయి.