Betting App Case: బెట్టింగ్ యాప్ కేసులో సీఐడీ సిట్ దూకుడు.. విచారణకు హాజరైన హీరోయిన్లు
ABN , Publish Date - Nov 21 , 2025 | 03:23 PM
ఇటీవల బెట్టింగ్ యాప్‌ల బారిన పడి పలువురు యువకులు ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన ప్రముఖులను సీఐడీ సిట్ అధికారులు వరుసగా విచారిస్తున్నారు. ఈ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.
హైదరాబాద్, నవంబరు21(ఆంధ్రజ్యోతి): బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు (Betting App Case)లో సీఐడీ సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఈ నేపథ్యంలో వీటిని ప్రమోట్ చేసిన పలువురు ప్రముఖులను విచారిస్తున్నారు. ఇవాళ(శుక్రవారం) విచారణకు హీరోయిన్లు నిధి అగర్వాల్, అమృత చౌదరి, యాంకర్ శ్రీముఖి హాజరయ్యారు.
నిధి అగర్వాల్ జీత్ విన్ అనే బెట్టింగ్ సైటును ప్రమోట్ చేయగా.. శ్రీముఖి (M88 యాప్) అనే యాప్ ను ప్రమోట్ చేశారు. M88 అనేది సాధారణంగా ఆన్‌లైన్ స్పోర్ట్స్ బెట్టింగ్, కాసినో గేమ్స్ కోసం ఉపయోగించే అంతర్జాతీయ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌గా తెలుస్తోంది. యోలో 247 (Yolo 247), ఫెయిర్‌ప్లే (Fairplay)లను అమృత చౌదరి ప్రమోట్ చేశారని వార్తలు వచ్చాయి. విచారణకు హాజరైన వారిని అధికారులు పలు ప్రశ్నలు అడుగుతున్నట్లు సమాచారం. బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేయడానికి గల కారణాలపై సీఐడీ సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.
బ్యాంక్ స్టేట్‌మెంట్లు, బెట్టింగ్ యాప్ యాజమాన్యాలతో చేసుకున్న అగ్రిమెంట్ వివరాలను సీఐడీ సిట్‌కి అందజేశారు నిధి అగర్వాల్, శ్రీముఖి, అమృత చౌదరి. సినీ ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లపై గతంలో మియాపూర్, పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లలో కేసులు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో మొత్తం 29 మందిపై కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఇప్పటికే విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి , ప్రకాశ్‌రాజ్, యాంకర్ విష్ణుప్రియ , సిరి హనుమంతులను విచారణ చేశారు సీఐడీ సిట్ అధికారులు.
ఈ వార్తలు కూడా చదవండి..
భారతదేశంలో స్వదేశీ వస్తువుల వినియోగం పెరగాలి: రామచంద్రరావు
ఏ తప్పూ చేయలేదు.. లై డిటెక్టివ్‌కు రెడీ: కేటీఆర్
Read Latest Telangana News And Telugu News