Chiranjeevi Deepfake: చిరంజీవిపై డీప్‌ఫేక్ వీడియోలు.. కేసు నమోదు..
ABN , Publish Date - Oct 27 , 2025 | 06:57 AM
మెగాస్టార్ చిరంజీవి ఫొటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల వీడియోలుగా మార్చి వెబ్‌సైట్లు, సోషల్ మీడియాలో దుండగులు పోస్ట్ చేశారు. దీంతో అవి వైరల్‌గా మారాయి.
హైదరాబాద్: ప్రపంచం రోజుకో కొత్త సాకేంతిక పరిజ్ఞానంతో ముందుకు దూసుకెళ్తోంది. ఇటీవల వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు సృష్టిస్తోంది. అయితే దీనిని వాడే విధానంలోనే అనేక పెడధోరణులకు దారితీస్తోంది. రాజకీయ, దేశ వ్యతిరేక, అశ్లీల కంటెంట్‌ను ప్రచారం చేయడానికి కొందరు దీన్ని వాడుతున్నారు. AIని ఉపాయోగించుకుని డీప్‌ఫేక్ వంటి చిత్రాలను క్రియేట్ చేసి.. దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా.. సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ డీప్‌ఫేక్ బారినపడ్డారు.
మెగాస్టార్ చిరంజీవి ఫొటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల వీడియోలుగా మార్చి వెబ్‌సైట్లు, సోషల్ మీడియాలో దుండగులు పోస్ట్ చేశారు. దీంతో అవి వైరల్‌గా మారాయి. ఇది గమనించిన ఆయన వెంటనే సీపీ వీసీ సజ్జనార్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం కోర్టను సైతం ఆశ్రయించటంతో న్యాయస్థానం ఆదేశాలతో సైబర్‌క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తన పేరును దెబ్బతీసేలా డీప్‌ఫేక్ వీడియోలు రూపొందిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మెగాస్టార్ చిరంజీవి కోరారు.
ఇవి కూడా చదవండి..
Modi Hails Kumram Bheem: కుమ్రం భీమ్ పోరాటం తరతరాలకు స్ఫూర్తిదాయకం
Male Dolphins Wear Sea Sponge: నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలే..!