Share News

Danam Nagender: మంత్రి పదవిపై దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Jul 07 , 2025 | 12:13 PM

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు కాంగ్రెస్‌దేనని దానం నాగేందర్ ధీమా వ్యక్తం చేశారు.

Danam Nagender:  మంత్రి పదవిపై దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు
MLA Danam Nagender

హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (MLA Danam Nagender) కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు కాంగ్రెస్‌దేనని ధీమా వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఛాలెంజ్‌ని మాజీ మంత్రి కేటీఆర్ స్వాగతించాలి కానీ వక్రీకరించడం మంచిది కాదని హితవు పలికారు. ఇవాళ(సోమవారం) గాంధీభవన్‌లో దానం నాగేందర్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ అంతర్గత సమస్యలు పరిష్కరించుకుంటే మంచిదని సూచించారు.


చాలామంది బీజేపీ బీసీ నేతలు తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవికోసం ప్రయత్నం చేసినా ఓసీకి ఇచ్చారని చెప్పుకొచ్చారు దానం నాగేందర్. బీజేపీ నేతలు ఇంకా ఊహాల్లోనే ఉన్నారని విమర్శించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తనను ఎంపీగా గెలిపించిన సికింద్రాబాద్‌కి ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. పేరుకే పసుపు బోర్డు ఉందని.. దానికి కనీసం ఆఫీస్ కూడా లేదని విమర్శించారు. తన మంత్రి పదవి అనేది హైకమాండ్ డిసైడ్ చేస్తోందని దానం నాగేందర్ పేర్కొన్నారు.


ఢిల్లీకి దానం నాగేందర్..

అయితే.. దానం నాగేందర్ ఇవాళ(సోమవారం) ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏఐసీసీ అగ్ర నేతలను ఎమ్మెల్యే కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేబినెట్ విస్తరణలో తనకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరనున్నట్లు సమాచారం. ఇప్పటికే మూడు మంత్రి పదవులను ఇటీవల ఏఐసీసీ హై కమాండ్ భర్తీ చేసింది. మిగిలిన పదవులను కూడా భర్తీ చేయడానికి హై కమాండ్ కసరత్తు చేస్తోంది. ఈ సారి భర్తీ చేసే మంత్రి పదవుల్లో బీసీలు, ఎస్సీలకు ప్రాధాన్యం ఇచ్చేలా చూడాలని ఆ సామాజిక వర్గాల నేతలు కోరుతున్నారు. అయితే అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోనుందోనని కాంగ్రెస్ నేతలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

వరంగల్‌ పర్యటనలో గవర్నర్‌ జిష్ణు దేవ్ వర్మ.. విద్యార్థి సంఘాల నేతల అరెస్టుతో ఉద్రిక్తత

సిగాచి పరిశ్రమలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 07 , 2025 | 12:33 PM