Home » Danam Nagender
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళం నెలకొంది. సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టి, పోడియం వద్దకు దూసుకెళ్లి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ శాసనసభ సోమవారానికి వాయిదా పడింది. మంత్రి భట్టి విక్రమార్క 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిలపై దాఖలైన అనర్హత పిటిషన్లనూ స్పీకర్ ప్రసాద్‌కుమార్ డిస్మిస్ చేశారు.
ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్‌లపై అనర్హత పిటీషన్‌ను డిస్మిస్ చేయడం దారుణమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో శాసన వ్యవస్థే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ధ్వజమెత్తారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పు ఇచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో గత ఏడాది కాలంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారం ఇప్పుడు క్లైమాక్స్ కి చేరుకుంది. బీఆర్ఎస్(BRS) పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శనివారం తుది విచారణను ముగించారు. వివరాల్లోకి వెళితే..
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి పిటిషన్‌లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ విచారణ చేపట్టారు.
అనర్హత పిటిషన్లపై ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నేడు విచారించనున్నారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.. దానం నాగేందర్‌పై స్పీకర్ అనర్హత వేటు వేస్తారని నమ్ముతున్నామన్నారు.
బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్‌కు సంబంధించి తెలంగాణ స్పీకర్ ఇచ్చిన నోటీసులపై ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. పదవుల కోసం వెళ్లలేదని.. విస్మరించారు గనుకే వదలాల్సి వచ్చిందని స్పష్టం చేశారు.
ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ దాఖలు చేసిన అనర్హత పిటిషన్‌పై అఫిడవిట్ దాఖలు చేశారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారన్న పిటిషన్‌ను కొట్టి వేయాలని స్పీకర్ ప్రసాద్ కుమార్‌కు విజ్ఞప్తి చేశారు. తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదని స్పష్టం చేశారు.