BRS: జీహెచ్ఎంసీ కమిషనర్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ.. అసలు కారణమిదే
ABN , Publish Date - Jan 23 , 2025 | 05:02 PM
BRS: గ్రేటర్ హైదరాబాద్‌లో చాలా సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని.. వాటిని త్వరగా పరిష్కరించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేపట్టారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తిని కలిసి వినతి పత్రం అందజేశారు.

హైదరాబాద్: మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) ఆధ్వర్యంలో ఇవాళ(గురువారం) బీఆర్ఎస్ (BRS) పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ (GHMC) కమిషనర్ ఇలంబర్తిని కలిశారు. కమిషనర్‌ను కలిసి హైదరాబాద్‌లోని ప్రజా సమస్యలు, అభివృద్ధి పనులపై నేతలు వినతిపత్రం సమర్పించారు. జీహెచ్ఎంసీ కమిషనర్‌తో గ్రేటర్ హైదరాబాద్‌కు చెందిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు భేటీ అయ్యారు. కేవలం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను మాత్రమే ఛాంబర్ లోపలకు కమిషనర్ అనుమతించారు. ఛాంబర్ బయటనే బీఆర్ఎస్ కార్పొరేటర్లు వెయిట్ చేశారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ... మేయర్, డిప్యూటీ మేయర్‌పై అవిశ్వాస తీర్మానంపై ఎల్లుండి పార్టీ మీటింగ్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
నగరంలో ప్రజలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ప్రజా సమస్యలపై కమిషనర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చామన్నారు. స్ట్రీట్ లైట్స్ ఎక్కడ వెలగట్లేదు, రోడ్లు సరిగ్గా లేవు అని చెప్పారు. ఫ్లై ఓవర్లపై నిర్మాణాలు ఆగిపోయాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది ఏ పనులు చేయకపోయినా తాము సైలెంట్‌గా ఉన్నాం.. ఇకనుంచి ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని అన్నారు. లక్షల సంఖ్యలో రేషన్ కార్డుల అప్లికేషన్లు వచ్చాయి.. దరఖాస్తు చేసుకున్న వారికి రేషన్ కార్డులు ఇవ్వాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు.
BRS ప్రజాప్రతినిధులకు సంబంధించిన ప్రోటోకాల్‌ను ఎందుకు పాటించడం లేదని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యేలకు చెప్పకుండానే శంకుస్థాపనలు ఎలా చేస్తున్నారని నిలదీశారు. అధికారులు తమ ఫోన్లు ఎత్తడం లేదు.. తమ నెంబర్లు బ్లాక్ చేస్తున్నారని ఆరోపించారు. వైకుంఠ ధామాల నిర్మాణాలు మధ్యలో ఆగిపోయాయని చెప్పారు. ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా ఇన్నిరోజులు తాము ఎలాంటి ఆందోళన చేయలేదని అన్నారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్‌లో తమ పార్టీ సభ్యులే మెజార్టీ సంఖ్యలో ఉన్నారు.. అయినా తమ సభ్యుల ప్రశ్నలు ఎందుకు పట్టించుకోవడం లేదని తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు.
ఈ వార్తలు కూడా చదవండి
Hyderabad: మాధవి కేసులో బిగ్ ట్విస్ట్.. పోలీసులు ఏం చెప్పారంటే..
Telangana Govt: హైదరాబాద్‌కు అత్యాధునిక డేటా సెంటర్..
KTR: సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్.. అసలు విషయం ఏంటంటే..
For More Telangana News and Telugu News..