Share News

BJP MLA Rakesh Reddy: బీజేపీ ఎమ్మెల్యే రాకేష్‌‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Jul 02 , 2025 | 10:34 AM

బీఆర్ఎస్ ప్రభుత్వంలో లీడర్ల వ్యాపార భాగస్వాములంతా ఆంధ్రావాళ్లేనని బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్‌‌రెడ్డి ఆరోపణలు చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో కాంట్రాక్టులన్నీ ఏపీ వాళ్లకే ఇచ్చారని విమర్శించారు. నా భార్యది నెల్లూరు, సీఎం రేవంత్‌రెడ్డి అల్లుడిది ఆంధ్రా అని రాకేష్‌‌రెడ్డి పేర్కొన్నారు.

BJP MLA Rakesh Reddy: బీజేపీ ఎమ్మెల్యే రాకేష్‌‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
BJP MLA Rakesh Reddy

హైదరాబాద్‌: బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్‌‌రెడ్డి (BJP MLA Rakesh Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సెంటిమెంట్ ఒక పార్టీకి ఫ్యాషన్ అయిందని విమర్శించారు. అవసరాలకోసం సెంటిమెంట్ పేరుతో ప్రజలను చంపుతున్నారని ఆరోపించారు. ఆదిలాబాద్, వరంగల్ తండాల్లో ప్రజలకు అన్యాయం జరిగితేనే తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడాలని రాకేష్‌‌రెడ్డి హితవు పలికారు. ఇవాళ(బుధవారం) హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో రాకేష్‌‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.


తెలంగాణ రాష్ట్రం వచ్చి పదేళ్లు అయిందని.. ఆత్మగౌరవం బ్రహ్మాండంగా ఉందని చెప్పుకొచ్చారు. ఇక మీదట తెలంగాణ పదం తక్కువగా వాడాలని సూచించారు. కొందరు ఆడితేనే బతుకమ్మ కాదని.. బతుకమ్మ అందరిదని స్పష్టం చేశారు. కొందరికీ ఇబ్బందులు వస్తే తెలంగాణ ఆత్మగౌరవానికి ఏం సంబంధమని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో లీడర్ల వ్యాపార భాగస్వాములంతా ఆంధ్రావాళ్లేనని ఆరోపణలు చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో కాంట్రాక్టులన్నీ ఏపీ వాళ్లకే ఇచ్చారని విమర్శించారు. నా భార్యది నెల్లూరు, సీఎం రేవంత్‌రెడ్డి అల్లుడిది ఆంధ్రా అని రాకేష్‌‌రెడ్డి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి

మేడారం మహాజాతర తేదీలు ఖరారు

AP Deputy CM: నటి పాకీజాకు పవన్‌ ఆపన్నహస్తం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 02 , 2025 | 10:51 AM