Share News

Formula E Case: ఫార్ములా ఈ కేసు.. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌కు నోటీసులు

ABN , Publish Date - Jun 25 , 2025 | 05:39 PM

ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌కు ఏసీబీ అధికారులు బుధవారం నోటీసులు జారీ చేశారు. జులై 1వ తేదీన ఆయన విచారణకు రావాలని అధికారులు నోటీసులో పేర్కొన్నారు.

Formula E Case: ఫార్ములా ఈ కేసు.. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌కు నోటీసులు
IAS officer Arvind Kumar

హైదరాబాద్: ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో (Formula E car Racing Case) ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌కు (IAS officer Arvind Kumar) ఏసీబీ అధికారులు ఇవాళ(బుధవారం) నోటీసులు జారీ చేశారు. జులై 1వ తేదీన విచారణకు రావాలని అధికారులు నోటీసులో పేర్కొన్నారు. గత కొద్దిరోజులుగా అరవింద్ కుమార్ విదేశాల్లోనే ఉంటున్నారు. అరవింద్‌ని మరోసారి విచారణ జరిపి స్టేట్‌మెంట్ రికార్డ్ చేయనున్నారు. మాజీమంత్రి కేటీఆర్ రెండు దఫాలుగా ఇచ్చిన స్టేట్‌మెంట్‌పై అరవింద్‌ని కూడా మరోసారి ఏసీబీ అధికారులు విచారణ జరపనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

యాంటీ డ్రగ్స్ డే ర్యాలీ.. డ్రగ్స్ నివారణ పోస్టర్లు విడుదల

ఫోన్ ట్యాపింగ్ కేసు.. తవ్వేకొద్దీ బయటపడుతున్న నిజాలు

Read latest Telangana News And Telugu News

Updated Date - Jun 26 , 2025 | 02:19 PM