Share News

Rainfall: హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. జలదిగ్బంధంలో కీలక ప్రాంతాలు..

ABN , Publish Date - Aug 04 , 2025 | 05:48 PM

హైదరాబాద్ నగరం కుండపోత వర్షంతో తడిసి ముద్దయింది. సిటీలోని పలు కీలక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వందలాది మంది విద్యార్థులు, ప్రజలు ఎక్కడివారక్కడ చిక్కుకుపోయారు. దీంతో జీహెచ్‌ఎంసీ, హైడ్రా అత్యవసర బృందాలను రంగంలోకి దించాయి.

Rainfall: హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. జలదిగ్బంధంలో కీలక ప్రాంతాలు..
Heavy Rain Fall Hyderabad

హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో కుండ పోత వర్షం కురుస్తోంది. సిటీలోని పలు ప్రాంతాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. భాగ్యనగరంలోని అనేక ప్రాంతాలు భారీ ఎత్తున వర్షపు నీరు నిలిచిపోయింది. సెక్రటేరియట్ బస్టాప్స సిటీ సెంట్రల్ జోన్ నీట మునిగాయి. ట్యాంక్ బండ్-సెక్రటేరియట్ మార్గంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఖైరతాబాద్, లక్డీకాపూల్, హిమాయత్ నగర్, నారాయణగూడ పరిసర ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ కింద నిలిచిపోయిన వర్షపు నీరు నిలిచిపోవడంతో.. ఖైరతాబాద్- పంజాగుట్ట మార్గంలో వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. ఖైరతాబాద్ వాటర్ బోర్డు కార్యాలయం వెనుక ఓ ప్రైవేట్ స్కూల్ నీట మునిగింది. వందలాది మంది విద్యార్థులు స్కూల్లోనే చిక్కుకుపోయారు.


కుండపోత వర్షం కారణంగా నగరాల్లోని పలురోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. తెలుగు తల్లి ఫ్లైఓవర్, నారాయణగూడ ఫ్లైఓవర్ పై కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు నిలిచిపోయాయి. మ్యాన్ హోల్స్ ప్రమాదకర రీతిలో పొంగిపొర్లుతున్నాయి. హిమాయత్ నగర్-నారాయణగూడ మార్గంలోనూ వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో జీహెచ్‌ఎంసీ టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.


కాగా, నారాయణగూడ, హిమాయత్ నగర్, సోమాజిగూడ, పంజాగుట్ట, ఖైరతాబాద్ సహా అనేక లోతట్టు ప్రాంతాలకు సహాయక చర్యల కోసం హైడ్రా ప్రత్యేక బృందాలను పంపింది. అలాగే హైడ్రా టీమ్స్ బోట్లనూ సిద్ధం చేస్తున్నాయి. జీహెచ్‌ఎంసీ 350 మాన్సూన్ టీమ్స్ రంగంలోకి దించింది. లోతట్టు ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టింది. అధికారులంతా ఫీల్డ్‌లోకి రావాలంటూ ఇప్పటికే జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలకు కేసీఆరే బాధ్యుడు..

వారిపై చర్యలకు కాళేశ్వరం కమిషన్ కీలక సిఫార్స్

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 04 , 2025 | 06:04 PM