Share News

AP Free Bus Guidelines: ఏపీలో ఉచిత బస్సు ప్రయాణంపై మార్గదర్శకాలు జారీ

ABN , Publish Date - Aug 04 , 2025 | 04:54 PM

ఏపీలో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.

AP Free Bus Guidelines: ఏపీలో ఉచిత బస్సు ప్రయాణంపై మార్గదర్శకాలు జారీ

అమరావతి, ఆగస్టు 4: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆగష్టు 15 వ తేదీ నుంచి రాష్ట్ర మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక సూపర్ సిక్స్ పథకాలు ఒక్కోక్కటి ప్రజలకు చేరువ చేస్తున్నట్లు తెలిపారు. దానిలో భాగంగానే రాష్ట్రంలోని మహిళలకు అందరికి ప్రీ బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.


ఈ బస్సుల్లో మాత్రమే..

ఆగస్టు 15వ తారీఖున ఈ పథకం అమలుకు ప్రభుత్వం సంసిధ్దంగా ఉందని తెలిపారు. జనవరి నెలలో కర్నాటక, తమిళనాడు, తెలంగాణలో పర్యటించి అక్కడ అమలు జరుగుతున్న ఫ్రీ బస్సు పథకాన్ని పరిశీలించినట్లు మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు ముందు మహిళలకు ఎన్నో స్కీములు చెప్పామని, దానిలో ఉచిత బస్సు పథకాన్నికి మహిళలు మొగ్గు చూపారు అన్నారు. రాష్ట్రంలో ఎక్కడి నుండి ఎక్కడికయినా జీరో టికెటింగ్ విధానం అమలు చేస్తున్నట్లు చెప్పారు. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్, అల్ట్రా ఎక్స్ ప్రెస్‌లలో కూడా ఈ పథకం అమలులో ఉటుందని మంత్రి స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

లక్షలాది భారతీయుల ఖాతాలపై కీలక నిర్ణయం

రఘురామ కేసులో మరో కీలక పరిణామం

Updated Date - Aug 04 , 2025 | 05:23 PM