CM Revanth Reddy: ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన
ABN , Publish Date - Dec 04 , 2025 | 04:52 PM
ఇంద్రవెల్లిని పర్యాటక కేంద్రంగా మారుస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. త్వరలోనే ఆదిలాబాద్‌కు మళ్లీ వస్తానని.. రోజంతా సమస్యలపై సమీక్షిస్తానని తెలిపారు. ఎడ్యుకేషన్, ఇరిగేషన్, కమ్యూనికేషన్‌లో ఆదిలాబాద్ అభివృద్ధి చెందుతోందని వివరించారు.
ఆదిలాబాద్, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) కీలక ప్రకటన చేశారు. ఏడాదిలోపు ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు పనులు ప్రారంభిస్తామని వ్యాఖ్యానించారు. వరంగల్‌తో పాటు ఆదిలాబాద్‌కు అన్ని రకాల వసతులతో కూడిన ఎయిర్‌పోర్టు ఉండాల్సిందేనని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇక్కడ ఎయిర్‌పోర్టు వస్తే ఆదిలాబాద్‌కు పరిశ్రమలు వస్తాయని పేర్కొన్నారు సీఎం రేవంత్‌రెడ్డి.
ఎర్రబస్సే కాదని.. ఆదిలాబాద్‌కు ఎయిర్ బస్సు కూడా తీసుకువస్తామని చెప్పుకొచ్చారు. ఇవాళ(గురువారం) ఆదిలాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు. అనంతరం ప్రసంగించారు.ఆదిలాబాద్ అభివృద్ధి బాధ్యత నేనే తీసుకుంటానని చెప్పుకొచ్చారు. తమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కట్టితీరుతామని స్పష్టం చేశారు.ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి తానే వస్తానని తెలిపారు. ఈ ప్రాంతంలో అపారమైన సున్నపు గనులు ఉన్నాయని వివరించారు సీఎం రేవంత్‌రెడ్డి.
ఇంద్రవెల్లిని పర్యాటక కేంద్రంగా మారుస్తున్నామని పేర్కొన్నారు. త్వరలోనే ఆదిలాబాద్‌కు మళ్లీ వస్తానని.... రోజంతా సమస్యలపై సమీక్షిస్తానని తెలిపారు. ఎడ్యుకేషన్, ఇరిగేషన్, కమ్యూనికేషన్‌లో ఆదిలాబాద్ అభివృద్ధి చెందుతోందని వివరించారు. ఆదిలాబాద్‌లో తప్పకుండా యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. వర్సిటీ ఎక్కడ కట్టాలో స్థానిక నేతలంతా కలిసి ఒక నిర్ణయానికి రావాలని సూచించారు సీఎం రేవంత్‌రెడ్డి.
ఇంద్రవెల్లిలో యూనివర్సిటీ కడితే బాగుంటుందని తన భావన అని తెలిపారు. అనుమతి మాత్రమే తనదని.. ఎక్కడ కట్టాలో నిర్ణయం మీదేనని చెప్పుకొచ్చారు. ఏడాదిలో 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని అన్నారు. రాబోయే రోజుల్లో మరో 40 వేల ఉద్యోగాలు ఇస్తామని స్పష్టం చేశారు. మన యువత ఐఏఎస్, ఐపీఎస్‌లు అయినప్పుడే తనకు సంతోషమని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
సైబరాబాద్, రాచకొండ పోలీస్ వెబ్ సైట్లు హ్యాక్
కోతుల సమస్యపై లోక్‌సభలో చర్చించిన ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
Read Latest Telangana News And Telugu News