తొలివిడత గ్రామపంచాయతీ ఎన్నికలు గురువారం జరగనున్నాయి. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కానుండగా, మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగనుంది.
మొదటి విడత పంచాయతీ పోలింగ్‌కు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఒక ప్రకటనలో తెలిపారు. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, శాంతియుతంగా ఎన్నికల నిర్వహణే లక్ష్యంగా బందోబస్తు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.
మంచిర్యాల జిల్లా లోని ముగ్గురు ఎమ్మెల్యేలు సమస్యలను గాలికి ఒదిలేసి హైద రాబాద్‌లో ఉంటున్నారని, వారికి పంచాయతీ ఎన్నికల్లో తగిన బుద్ధిచెప్పాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాధ్ వెరబెల్లి పేర్కొన్నారు.
గ్రామపంచాయతీ ఎన్నికలను ఎన్నికల అధికారులు, సిబ్బంది పకడ్బందీగా నిర్వహించేలా కృషిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులకు ఆదేశించారు.
కుమరం భీం జిల్లాలోని 12 గ్రామాలు రెండు రాష్ట్రాల పరిధిలో ఉంటాయి. ఇటు తెలంగాణ అటు మహా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ గ్రామాలు మావంటే మావేనంటూ మూడున్నర దశాబ్దలుగా పోటాపోటీగా ఇక్కడ పాలన చేస్తున్నాయి.
పంచాయతీ ఎన్నికల్లో ఓట్లను రాబట్టేందుకు అభ్యర్థులు దేనికైనా తగ్గేదేలేదంటున్నారు. అప్పులు చేసి మరీ ఎన్నికల్లో నెగ్గేందుకు సిద్ధమవుతున్నారు. తొలివిడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో అభ్యర్థులు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీలో నూతనంగా డీసీసీ పదవులు చేపట్టిన వారి సత్తాకు పంచాయతీ ఎన్నికలు పరీక్షగా మారాయి. బాధ్యతలు చేపట్టగానే సర్పంచ్ ఎన్నికలు రావటంతో మెజారిటీ స్థానాల్లో విజయం సాధించడంతో పాటు అన్ని వర్గాలను సమన్వయం చేయడం డీసీసీ చీఫ్‌లకు సవాల్‌గా మారింది.
తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం బీఆర్‌ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్ ఆమరణ నిరహార దీక్ష చేపట్టడంతో పాటు విద్యార్థుల ఆత్మబలిదానాలు, ప్రజా పోరాటాలతో తెలంగాణ స్వరాష్ట్ర కళ సాకారమైందని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ తెలిపారు.
ప్రజలందరు నిర్భయం గా ఓటు హక్కును వినియోగించుకోవాలని మందమర్రి సీఐ శశిధర్‌రెడ్డి పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం చిర్రకుంట, పొన్నారం, వెంకటాపూర్, పులి మడుగు గ్రామాల్లో ఫ్లాగ్‌మార్చ్ నిర్వహిం చారు.
ఓటరుకు పల్లె 'పంచాయితీ' పద్మ వ్యూహంలా తయారైంది. అన్ని పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మ కంగా తీసుకున్నాయి. సారధులే స్వయంగా పల్లె బాట పడుతూ.. వ్యూహరచన చేస్తున్నారు. దీంతో గ్రామాల్లో ఎన్నికల ప్రచార తీరు మారింది. విందులు, హామీలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.