Tilak Varma: కౌంటీల్లో దుమ్మురేపిన తెలుగోడు.. గుర్తుండిపోయే నాక్!
ABN , Publish Date - Jun 24 , 2025 | 02:59 PM
టీమిండియా యంగ్ బ్యాటర్ తిలక్ వర్మ అదరగొట్టాడు. కౌంటీ అరంగేట్రంలోనే క్లాసికల్ నాక్‌తో ఆకట్టుకున్నాడు. ఇంతకీ అతడు ఎన్ని పరుగులు చేశాడంటే..

భారత యువ బ్యాటర్ తిలక్ వర్మ కౌంటీల్లో అదరగొడుతున్నాడు. అరంగేట్రంలోనే క్లాసికల్ ఇన్నింగ్స్‌తో అందర్నీ ఆకట్టుకున్నాడు. హ్యాంప్‌షైర్ తరఫున బరిలోకి దిగిన ఈ హైదరాబాదీ బ్యాటర్.. 234 బంతుల్లో 98 పరుగులు బాదాడు. ఇందులో 11 బౌండరీలు, 3 భారీ సిక్సులు ఉన్నాయి. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ ఓ చేయి వేశాడు తిలక్. వికెట్ తీయకపోయినా 2 ఓవర్లలో 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు. హ్యాంప్‌షైర్ ఇన్నింగ్స్‌లో తిలక్ బ్యాటింగ్ హైలైట్‌గా నిలిచింది. సాలిడ్ డిఫెన్స్‌తో ఒకవైపు వికెట్ కాపాడుకుంటూనే.. మరోవైపు స్ట్రైక్ రొటేషన్ చేయడం, వీలు చిక్కినప్పుడల్లా ఫోర్లు, సిక్సులు బాదడం అభిమానులను ఆకట్టుకుంది.
అలవోకగా..
కౌంటీల్లో రాణించడం అంత ఈజీ కాదు. పేస్‌కు సహకరించే పిచ్‌లపై పరుగులు చేయడంలో తోపు బ్యాటర్లు కూడా తడబడుతుంటారు. అలాంటి చోట తిలక్ ధైర్యంగా బ్యాటింగ్ చేశాడు. హ్యాంప్‌షైర్ 34 పరుగులకు 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన తిలక్.. నింపాదిగా, టెన్షన్ పడకుండా బ్యాటింగ్ చేశాడు. ప్రత్యర్థి బౌలర్లు నిప్పులు చెరిగే బంతులతో ఇబ్బందులు పెట్టినా.. అతడు మాత్రం కూల్‌గా తన పని తాను చేసుకుంటూ పోయాడు. ఒత్తిడిని తన మీద నుంచి అవతలి జట్టు పైకి నెట్టాడు. ఈ ఇన్నింగ్స్ చూసిన నెటిజన్స్.. సెలెక్టర్లకు తిలక్ పరీక్ష పెడుతున్నాడని అంటున్నారు. అతడు ఇలాగే ఆడుతూ పోతే భారత టెస్ట్ జట్టులోకి తెలుగోడ్ని తీసుకోవడం తప్పితే సెలెక్టర్లకు ఇంకో ఆప్షన్ లేదని కామెంట్స్ చేస్తున్నారు. త్వరలోనే తిలక్ టీమిండియాలోకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని చెబుతున్నారు.
ఇవీ చదవండి:
8 నెలల్లో కెరీర్ ముగుస్తుందన్నారు
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి