Share News

KL Rahul Preparations: సెంచరీలు ఊరికే రావు.. కేఎల్ రాహుల్ కష్టం చూస్తే మెచ్చుకోకుండా ఉండలేరు!

ABN , Publish Date - Jun 24 , 2025 | 02:11 PM

టీమిండియా స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. పరుగుల వరద పారిస్తున్న రాహుల్.. ఇంగ్లండ్‌తో సిరీస్‌లోనూ తగ్గేదేలే అంటూ దూసుకెళ్తున్నాడు.

KL Rahul Preparations: సెంచరీలు ఊరికే రావు.. కేఎల్ రాహుల్ కష్టం చూస్తే మెచ్చుకోకుండా ఉండలేరు!
KL Rahul

టీమిండియా స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ ఫార్మాట్లకు అతీతంగా రాణిస్తున్నాడు. టీ20, వన్డే, టెస్టులు.. ఇలా ఫార్మాట్ ఏదైనా సరే బరిలోకి దిగితే పరుగుల వర్షం కురిపించాల్సిందే అనేలా అతడి బ్యాటింగ్ సాగుతోంది. ఈ ఏడాది ఆరంభంలో చాంపియన్స్ ట్రోఫీలో అదరగొట్టిన రాహుల్.. ఆ తర్వాత ఐపీఎల్‌లో అదే ఫామ్‌ను కొనసాగించాడు. ఇప్పుడు ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లోనూ దుమ్మురేపుతున్నాడు. లీడ్స్ టెస్ట్‌ సెకండ్ ఇన్నింగ్స్‌లో 137 పరుగులతో భారత బ్యాటింగ్‌ను ముందుండి నడిపించాడు. అతడి సెంచరీకి అంతా ఇంప్రెస్ అవుతున్నారు. వాటే బ్యాటింగ్ అంటూ మెచ్చుకుంటున్నారు.


పంత్‌తో కలసి..

సెంచరీ బాదిన రాహుల్.. వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ (118)తో కలసి నాలుగో వికెట్‌కు 195 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. వీళ్లిద్దరూ రాణించడం వల్లే 364 పరుగులు చేయగలిగింది భారత్. దీంతో రాహుల్‌ను అంతా పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేని లోటు కనపడకుండా చేస్తున్నాడని, అతడి బ్యాటింగ్ అద్భుతమని ప్రశంసిస్తున్నారు. ఈ జోరు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నారు. ఈ తరుణంలో కేఎల్ ప్రాక్టీస్ వీడియో ఒకటి నెట్టింట హల్‌చల్ చేస్తోంది. మ్యాచ్‌కు వెళ్లే ముందు సన్నాహకాల్లో రాహుల్ పడిన కష్టాన్ని ఇందులో చూడొచ్చు.


ఇలాగే సాగిపో..

ఎక్సర్‌సైజులు చేస్తూ, పరిగెత్తుతూ, బ్యాటింగ్ సాధన చేస్తూ మ్యాచ్‌కు ముందు రాహుల్ చేసిన ప్రాక్టీస్ తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్.. సెంచరీలు ఊరికే రావు, వాటి వెనుక కఠోర శ్రమ దాగి ఉంటుందని అంటున్నారు. ఫిట్‌నెస్, బ్యాటింగ్ టెక్నిక్స్‌పై కష్టపడ్డాడు కాబట్టే రాహుల్ ఇంతలా సక్సెస్ అవుతున్నాడని.. అతడి శ్రమే అతడ్ని ఈ స్థాయికి చేర్చిందని చెబుతున్నారు. ఇలాగే ఆడుతూ పోతే మరికొన్నేళ్లలో రాహుల్ దిగ్గజ స్థాయిని అందుకోవడం ఖాయమని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


ఇవీ చదవండి:

బౌలర్లదే విజయభారం

పంత్‌ తనలో తను

8 నెలల్లో కెరీర్‌ ముగుస్తుందన్నారు

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 24 , 2025 | 02:11 PM