Share News

KL Rahul: కేఎల్ రాహుల్ క్రేజీ రికార్డ్.. ఎప్పటికీ గుర్తుండిపోతుంది!

ABN , Publish Date - Jun 23 , 2025 | 07:01 PM

టీమిండియా స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఏకంగా బ్యాటింగ్ గ్రేట్ సునీల్ గవాస్కర్ సరసన అతడు చోటు దక్కించుకున్నాడు.

KL Rahul: కేఎల్ రాహుల్ క్రేజీ రికార్డ్.. ఎప్పటికీ గుర్తుండిపోతుంది!
KL Rahul

టీమిండియా స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ క్రేజీ రికార్డ్ సృష్టించాడు. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో చెలరేగి ఆడుతున్నాడీ భారత ఓపెనర్. 181 బంతుల్లో 83 పరుగుల క్లాసికల్ నాక్‌తో జట్టుకు పెద్ద దిక్కుగా నిలిచాడు. ఈ క్రమంలో అతడు ఓ అరుదైన ఘనతను అందుకున్నాడు. సేనా (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో మోస్ట్ ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు బాదిన టీమిండియా రెండో ఓపెనర్‌గా నిలిచాడు. దిగ్గజ బ్యాటర్ సునీల్ గవాస్కర్ ఉన్న క్లబ్‌లో రాహుల్ చోటు దక్కించుకున్నాడు.

rahul.jpg


అరుదైన క్లబ్‌లో..

సేనా దేశాల్లో అత్యధిక 50 ప్లస్ స్కోర్లు బాదిన భారత ఓపెనర్‌గా గవాస్కర్ (19 సార్లు) అగ్రస్థానంలో ఉన్నాడు. అతడి తర్వాతి స్థానంలో ఉన్న వెటరన్ ఓపెనర్ మురళీ విజయ్ (9 సార్లు) సరసన ఇప్పుడు రాహుల్ (9 సార్లు) నిలిచాడు. విజయ్‌తో కలసి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు రాహుల్. ఇదే ఫామ్, ఫిట్‌నెస్‌ను మరికొన్నేళ్ల పాటు కొనసాగిస్తే గవాస్కర్ రికార్డును రాహుల్ బద్దలుకొట్టినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఈ రికార్డుపై నెటిజన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ పడిన కష్టం, శ్రమకు దక్కిన ఫలితం ఇది అని అంటున్నారు. ఇది ఎప్పటికీ గుర్తుండిపోతుందని చెబుతున్నారు. గవాస్కర్‌ను దాటేయాలి అంటూ రాహుల్‌ను ఎంకరేజ్ చేస్తున్నారు. కాగా, లీడ్స్ టెస్ట్‌లో భారత్ ప్రస్తుతం 3 వికెట్లకు 191 పరుగులతో ఉంది. మన జట్టు ఆధిక్యం 197కు చేరింది. రాహుల్‌తో పాటు రిషబ్ పంత్ (55 నాటౌట్) క్రీజులో ఉన్నాడు. నాలుగో రోజును వీళ్లిద్దరూ ఔట్ కాకుండా విజయవంతంగా ముగిస్తే మ్యాచ్‌పై భారత్ పట్టు మరింత పెరుగుతుంది.

ind-vs-eng.jpg


ఇవీ చదవండి:

దంచికొట్టిన సన్‌రైజర్స్ స్టార్

పృథ్వీ షా సంచలన నిర్ణయం

బుమ్రా సంచలన వ్యాఖ్యలు

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 23 , 2025 | 07:01 PM