Share News

Asian Wrestling Championship: పురుషుల జట్టుకు టీమ్‌ టైటిల్‌

ABN , Publish Date - Jun 23 , 2025 | 02:57 AM

అండర్‌-23 ఆసియా రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో మనోళ్లు పురుషుల ఫ్రీస్టయిల్‌ టీమ్‌ టైటిల్‌ దక్కించుకున్నారు. టోర్నీలో పురుషుల జట్టు ఆరు స్వర్ణాలు, ఒక రజత పతకంతో దుమ్ము రేపింది.

Asian Wrestling Championship: పురుషుల జట్టుకు టీమ్‌ టైటిల్‌

  • ఆసియా అండర్‌-23 రెజ్లింగ్‌

ఉంగ్‌ తావు (వియత్నాం): అండర్‌-23 ఆసియా రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో మనోళ్లు పురుషుల ఫ్రీస్టయిల్‌ టీమ్‌ టైటిల్‌ దక్కించుకున్నారు. టోర్నీలో పురుషుల జట్టు ఆరు స్వర్ణాలు, ఒక రజత పతకంతో దుమ్ము రేపింది. మరోవైపు భారత మహిళలు కూడా టీమ్‌ టైటిల్‌ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 10 విభాగాలలో.. మన మహిళలు ఒక్కో కేటగిరీలో ఒక పతకం గెలుచుకున్నారు. ఇక..గ్రీకో రోమన్‌ విభాగంలో భారత పురుషులు ఒక స్వర్ణం సహా 3 పతకాలు నెగ్గారు.

Updated Date - Jun 23 , 2025 | 02:58 AM