Shivam Dube: లగ్జరీ అపార్ట్‌మెంట్స్ కొన్న టీమిండియా స్టార్.. ధరెంతో తెలిస్తే షాక్!
ABN , Publish Date - Jun 24 , 2025 | 04:45 PM
టీమిండియా పించ్ హిట్టర్ ఒకరు ఖరీదైన రెండు అపార్ట్‌మెంట్స్ కొనుగోలు చేశారు. కోట్లు పోసి అతడు ఈ అపార్ట్‌మెంట్స్ కొన్నాడని తెలుస్తోంది. ఇంతకీ ఆ ప్లేయర్ ఎవరంటే..

టీమిండియా పించ్‌హిట్టర్ శివమ్ దూబె రెండు ఖరీదైన అపార్ట్‌మెంట్స్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ముంబై వెస్ట్ అంధేరిలోని ఒషివరాలో అతడు అపార్ట్‌మెంట్స్ కొన్నట్లు సమాచారం. వీటి కోసం ఏకంగా రూ.27.50 కోట్లు ఖర్చు చేశాడట చెన్నై సూపర్ కింగ్స్ స్టార్. డీఎల్‌హెచ్ ఎంక్లేవ్‌లోని ఈ అపార్ట్‌మెంట్స్ సైజ్ 4,200 స్క్వేర్ ఫీట్ అని.. బాల్కనీతో కలుపుకొని 9,603 చదరపు అడుగులని తెలుస్తోంది. అపార్ట్‌మెంట్‌తో పాటు 3 పార్కింగ్ స్పేస్‌లను దూబె కొనుగోలు చేశాడట. జూన్ 20న వీటి రిజిస్ట్రేషన్ కూడా పూర్తయిందని.. అందులో భాగంగా స్టాంప్ డ్యూటీతో కలుపుకొని మొత్తం రూ.1.65 కోట్లు అతడు చెల్లించాడని తెలుస్తోంది.
పక్కా ప్లానింగ్‌తో..
శివమ్ దూబె పక్కా ప్లాన్‌తోనే అంధేరి వెస్ట్ ఏరియాలో అపార్ట్‌మెంట్స్ కొనుగోలు చేశాడని తెలుస్తోంది. వెస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవే, లింక్ రోడ్, ఎస్వీ రోడ్, వెర్సోవా- అంధేరి-ఘట్కోపర్ మెట్రో లైన్.. ఇలా అన్ని రూట్లకు దగ్గరగా ఉండటంతో ఈ ప్రాంతంలో దూబె ఇళ్లు కొనుగోలు చేశాడట. కాగా, భారత టీ20 జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న ఈ లెఫ్టాండ్ బ్యాటర్.. వన్డే టీమ్‌లో తన స్థానాన్ని పదిలం చేసుకోవాలని చూస్తున్నాడు. ఇటీవలే ఐపీఎల్‌తో ఆకట్టుకున్న దూబె.. మున్ముందు టీమిండియా తరఫున ఆడుతూ అభిమానులను మరింత అలరించాలని చూస్తున్నాడు. ఈ తరుణంలో అతడు అపార్ట్‌మెంట్స్ కొన్న వార్త బయటకు వచ్చింది. దీన్ని దూబె అధికారికంగా ధృవీకరించలేదు. కానీ అపార్ట్‌మెంట్స్ కొన్న మాట వాస్తవమేనని భారత క్రికెట్ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఇది తెలిసిన నెటిజన్స్.. ఇల్లు కోసం ఇన్ని కోట్లు ఖర్చు చేస్తారా? అని నివ్వెరపోతున్నారు.
ఇవీ చదవండి:
కౌంటీల్లో దుమ్మురేపిన తెలుగోడు
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి