Share News

MS Dhoni: ధోని పొలిటికల్ ఎంట్రీ.. ఇదేం ట్విస్ట్ భయ్యా

ABN , Publish Date - Feb 02 , 2025 | 04:25 PM

MS Dhoni Political Entry: టీమిండియా లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పినా.. ఐపీఎల్‌లో మాత్రం ఇంకా కంటిన్యూ అవుతున్నాడు. వచ్చే సీజన్‌ కోసం అతడు సన్నద్ధమవుతున్న తరుణంలో హఠాత్తుగా అతడి పొలిటికల్ ఎంట్రీ గురించి రూమర్స్ గుప్పుమన్నాయి.

MS Dhoni: ధోని పొలిటికల్ ఎంట్రీ.. ఇదేం ట్విస్ట్ భయ్యా
MS Dhoni Political Entry

భారత దిగ్గజ సారథి మహేంద్ర సింగ్ ధోని ఇప్పుడు బిజీగా ఉన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ కొత్త సీజన్ కోసం అతడు సన్నద్ధమవుతున్నాడు. క్యాష్ రిచ్ లీగ్‌కు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఇప్పటినుంచే ప్రాక్టీస్ చేస్తున్నాడు. లీగ్ ఆరంభమయ్యే టైమ్‌కు ఫుల్ ఫిట్‌గా ఉండాలని అనుకుంటున్నాడు. బ్యాట్‌తోనూ టచ్‌లోకి రావాలని చూస్తున్నాడు. అయితే ఒకవైపు మాహీ క్రికెట్, వ్యవసాయ పనులు, యాడ్ షూటింగ్స్ అంటూ బిజీగా ఉన్న తరుణంలో మరోవైపు అతడి పొలిటికల్ ఎంట్రీ గురించి ఊహాగానాలు జోరందుకున్నాయి. అసలేం జరుగుతోంది అనేది ఇప్పుడు చూద్దాం..


గెలుపు ఖాయం!

ధోని రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ పుకార్లు వస్తున్నాయి. ఈ అంశంపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించారు. తాజాగా ఒక యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధోని రాజకీయ ప్రవేశం గురించి రియాక్ట్ అయ్యారు రాజీవ్ శుక్లా. పాలిటిక్స్‌లోకి రావడం అనేది ధోని వ్యక్తిగతం అని ఆయన అన్నారు. అయితే వెస్ట్ బెంగాల్ రాజకీయాల్లోకి ఆయన వస్తారని తాను ఊహిస్తున్నానని తెలిపారు. క్రికెట్‌లోనే కాదు.. రాజకీయాల్లోనూ అతడు సత్తా చాటగలడని పేర్కొన్నారు రాజీవ్ శుక్లా. ఒకవేళ పొలిటికల్ ఎంట్రీ ఇస్తే మాత్రం ఈజీగా గెలుస్తాడని చెప్పుకొచ్చారు.


నిజం ఏంటి?

ధోనీకి ఫుల్ పాపులారిటీ ఉందన్నారు రాజీవ్ శుక్లా. రాజకీయ ప్రవేశం గురించి మాహీతో గతంలో మాట్లాడిన విషయాన్ని ఆయన పంచుకున్నారు. ఒకసారి ధోని లోక్‌సభ స్థానానికి పోటీ చేయనున్నారని పుకార్లు వచ్చాయని.. అదే విషయం అతడితో చెప్పానని రాజీవ్ శుక్లా పేర్కొన్నారు. అయితే అవి కేవలం రూమర్స్ మాత్రమేనని మాహీ కొట్టిపారేశాడని చెప్పుకొచ్చారు. ధోని పొలిటికల్ ఎంట్రీపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అతడు రాజకీయాల్లోకి వస్తే అదిరిపోతుందని సోషల్ మీడియాలో కొందరు నెటిజన్స్ అంటున్నారు. అక్కడా సక్సెస్ అవుతాడని చెబుతున్నారు. అయితే మరికొందరు నెటిజన్స్ మాత్రం మాహీ లాంటి వ్యక్తికి రాజకీయాలు సెట్ కావని కామెంట్స్ చేస్తున్నారు.


ఇవీ చదవండి:

తెలుగు బిడ్డ సంచలనం.. వరల్డ్ కప్ విన్నర్‌గా భారత్

డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్‌స్టార్ జాన్ సీనాకు బిగ్ షాక్.. మ్యాచ్ మధ్యలోనే..

భారత ప్లేయింగ్ 11లో సంచలన మార్పు.. మ్యాచ్ విన్నర్ వచ్చేస్తున్నాడు

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 02 , 2025 | 04:38 PM