Home » MS Dhoni
టీమిండియా మాజీ కెప్టెన్, క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోని అభిమానులకు చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం షాకింగ్ న్యూస్ చెప్పింది. గాయం కారణంగా ధోని రెండు వారాల పాటు మ్యాచ్‌లకు దూరం కానున్నాడు.
ప్రతి ఐపీఎల్ సీజన్ ఆరంభానికి ముందు అందరిదీ ఒకటే ప్రశ్న.. ధోనీకిదే ఆఖరి సీజనా? తాజాగా అతడి రిటైర్‌మెంట్‌పై మళ్లీ చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ధోనీ భవిష్యత్తుపై టీమిండియా క్రికెట్ దిగ్గజం సౌరభ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఎంఎస్ ధోనీ జెర్సీ నంబర్ మారనుందా? అతడి జెర్సీ నంబర్ 7 నుంచి 8కి మారబోతోందా? ఫేస్‌బుక్‌లో ధోనీ పెట్టిన తాజా పోస్ట్ ఆ చర్చకు కారణంగా నిలిచింది. రెండు దశాబ్దాలకు పైగా సాగిన తన కెరీర్‌లో ధోనీ ఏడో నెంబర్ జెర్సీతోనే బరిలోకి దిగాడు.
ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి ఊరట లభించింది. బీసీసీఐ నిబంధనను ధోని ఉల్లంఘిస్తున్నాడంటూ దాఖలైన ఫిర్యాదును బీసీసీఐ ఎథిక్స్ అధికారి అరుణ్ మిశ్రా కొట్టేశారు.
ఐపీఎల్ 2026 సందడి మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథ్ ఓ క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. ఈ సీజన్‌లో ధోనీ ఆడనున్నట్లు అధికారికంగా వెల్లడించారు.
భారత్ జట్టు టీ20 ప్రపంచ కప్ 2026ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం భారత జట్టును, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ను ప్రశంసిస్తూ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ట్వీట్ చేశాడు. దానికి తాజాగా గంభీర్ రిప్లై ఇచ్చాడు.
టీ20 ప్రపంచకప్ 2026లో భారత జట్టు చారిత్రక విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. నిన్న జరిగిన ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో ఘనంగా గెలిచి ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. ఈ విజయంపై భారత క్రికెట్ దిగ్గజాలు, మాజీ క్రికెటర్లు హర్షం వ్యక్తం చేస్తూ జట్టును అభినందించారు.
టీ20 ప్రపంచ కప్ 2026 కీలక పోరుకు సిద్ధమైంది. నేడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా న్యూజిలాండ్-భారత్ జట్లు ఫైనల్‌లో తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోనీ అహ్మదాబాద్ చేరుకున్నారు.
టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్ చూసేందుకు ముంబై వాంఖడే స్టేడియానికి టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ, భార్య సాక్షితో కలిసి వచ్చాడు. ప్రత్యేక గ్యాలరీ నుంచి వీరు మ్యాచ్‌ను వీక్షించారు. అయితే.. బుమ్రా క్యాచ్ పట్టడంతో సాక్షి ఎగిరి గంతేయగా.. ధోనీ స్పందించి ఆమెను నిలువరించాడు. ఈ ఘటన నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
నియమ నిబంధనల తుచ తప్పకుండా పాటించే టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తాజాగా ఓ నిబంధనను ఉల్లంఘించి వార్తల్లోకెక్కాడు. ఈ విషయంలో అతడికి జరిమానా కూడా పడింది.