Share News

MS Dhoni: ఒంటికాలిపై సిక్సులు.. ధోని ప్రిపరేషన్ మామూలుగా లేదు

ABN , Publish Date - Mar 01 , 2025 | 01:39 PM

IPL 2025: వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం లెజెండ్ ధోని సన్నద్ధమవుతున్నాడు. నెట్ సెషన్స్‌లో అతడు తీవ్రంగా చెమటోడ్చుతున్నాడు. తాజాగా అతడి ప్రాక్టీస్ ఫొటోలు బయటకు వచ్చాయి.

MS Dhoni: ఒంటికాలిపై సిక్సులు.. ధోని ప్రిపరేషన్ మామూలుగా లేదు
IPL 2025

టీమిండియా లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని వేట మొదలుపెట్టాడు. 9 నెలల పాటు ప్రొఫెషనల్‌కు క్రికెట్‌కు దూరంగా ఉన్న మాహీ.. మళ్లీ ఐపీఎల్‌లో సందడి చేసేందుకు రెడీ అవుతున్నాడు. రిటైర్మెంట్ తర్వాత క్యాష్ రిచ్ లీగ్‌లో ఆడుతూ అభిమానులను అలరిస్తున్న ధోని.. మరో సీజన్ కోసం సన్నద్ధమవుతున్నాడు. ఇప్పటికే చెన్నైకి చేరుకున్న అతడు.. సీఎస్‌కే క్యాంప్‌లో జాయిన్ అయిపోయాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా మాహీ ప్రాక్టీస్ విజువల్స్ బయటకు వచ్చాయి. అందులో ఒంటికాలిపై సిక్సులు బాదుతూ కనిపించాడతను.


ఎడాపెడా బాదేశాడు

కాళ్లకు ప్యాడ్స్ కట్టుకొని, ఆయుధం లాంటి బ్యాట్‌ను చేతపట్టి పిచ్‌ మీదకు అడుగుపెట్టాడు ధోని. బౌలర్లు వేసిన బంతులను నీళ్లు తాగినంత ఈజీగా భారీ సిక్సులు బాదాడు. నిలబడిన చోటు నుంచి బిగ్ షాట్స్ కొట్టాడు. ఓ షాట్ కొట్టే క్రమంలో ఒంటికాలి మీదే బ్యాలెన్స్ ఉంచాడు. ఇది సీఎస్‌కే ప్రాక్టీస్‌లో హైలైట్ అని చెప్పాలి. మాహీ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ దూరం నుంచి జాగ్రత్తగా గమనిస్తూ కనిపించాడు. బహుశా ధోని హిట్టింగ్‌ను ఎంజాయ్ చేస్తున్నాడేమో. వీళ్లిద్దరితో పాటు దాదాపు ఫుల్ స్క్వాడ్ ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ధోని వీడియోలు చూసిన నెటిజన్స్.. ఏటికేడు వయసు పెరుగుతున్నా మాహీ ఫిట్‌నెస్, పవర్, టైమింగ్, షాట్ హిట్టింగ్ ఏమాత్రం తగ్గడం లేదని మెచ్చుకుంటున్నారు.


ఇవీ చదవండి:

రోహిత్‌తో పాటు అతడు మిస్.. ప్లేయింగ్ 11 ఇదే..

డబ్బుతో సంబంధం లేదు.. అందరూ ఆడొచ్చు!

మూడోరౌండ్లో ప్రజ్ఞానంద గెలుపు

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 01 , 2025 | 01:46 PM