Share News

IPL 2025: నెత్తురుకు మరిగిన హంగ్రీ చీతా ఆగయా.. ఇక వేట మొదలు

ABN , Publish Date - Feb 27 , 2025 | 07:17 PM

Chennai Super Kings: నెత్తురుకు మరిగిన హంగ్రీ చీతా వచ్చేశాడు. ఐపీఎల్-2025కు ముందు టీమ్ క్యాంప్‌‌లో జాయిన్ అయ్యాడు. ఇక ప్రత్యర్థులకు ముచ్చెమటలు ఖాయమనే చెప్పాలి. మరి.. ఆ హంగ్రీ చీతా ఎవరు? అనేది ఇప్పుడు చూద్దాం..

IPL 2025: నెత్తురుకు మరిగిన హంగ్రీ చీతా ఆగయా.. ఇక వేట మొదలు
CSK

ఐపీఎల్‌లో ఆడటమే చాలా మంది క్రికెటర్స్ కల. దేశవాళీ ఆటగాళ్ల దగ్గర నుంచి అంతర్జాతీయ స్టార్ల వరకు క్యాష్ రిచ్ లీగ్‌లో ఒక్కసారైనా ఆడాలని కోరుకుంటారు. ఒకవేళ ఆడే చాన్స్ వచ్చి ట్రోఫీ విన్నింగ్ టీమ్‌లో భాగమైతే దానికి మించిన సంతోషం ఉండదు. ఇదే ఒకెత్తు అనుకుంటే ఒక ప్లేయర్ ఏకంగా 5 మార్లు విన్నింగ్ టీమ్‌లో భాగమయ్యాడు. బ్యాటర్‌గా, కీపర్‌గా, సారథిగా ముందుండి జట్టును నడిపిస్తూ ఐదుసార్లు విజేతగా నిలిపాడు. టీమ్ ఫ్యూచర్ కోసం ఏకంగా కెప్టెన్సీని త్యాగం చేసిన ఆ లెజెండ్ మళ్లీ వస్తున్నాడు. గెలుపు అనే నెత్తురుకు మరిగిన ఆ హంగ్రీ చీతా ఆల్రెడీ చెన్నై నగరంలో వాలిపోయాడు. ఇక ప్రత్యర్థులకు మరణమృదంగమే..


సినిమా లెవల్‌లో..

చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఐపీఎల్-2025 కోసం చెన్నైకి చేరుకున్నాడు మాహీ. అక్కడి ఎయిర్‌పోర్ట్‌ నుంచి సీఎస్‌కే క్యాంప్‌కు ధోని వస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి. స్టైలిష్‌ లుక్‌లో దర్శనమిచ్చిన సీఎస్‌కే మాజీ సారథి.. కూల్ ఔట్‌ఫిట్‌లో అదరగొట్టాడు. చేతికి వాచ్, కళ్లకు కూలింగ్ గ్లాసెస్‌ పెట్టుకున్న ధోని.. కారులో నుంచి దిగి సినిమా లెవల్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ఇది చూసిన నెటిజన్స్.. చీతా వచ్చేసిందని.. ఇక వేట మొదలుపెట్టడమే తరువాయి అని కామెంట్స్ చేస్తున్నారు. మాహీ ఫుల్ ప్రిపరేషన్‌తో వచ్చినట్లు కనిపిస్తోందని.. రాసుకోండి.. ఇక బౌలర్లకు కాళరాత్రేనని అంటున్నారు.


ఇవీ చదవండి:

టీమిండియా భారీ విరాళం.. మనసులు గెలిచారు బాస్

రోహిత్ సేనపై కుట్ర.. ఫలితం అనుభవించారు

కన్నీళ్లు పెట్టుకున్న నంబర్ వన్ క్రికెటర్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 27 , 2025 | 07:46 PM