Share News

Gill-Rishabh: గిల్‌కు పంత్ వార్నింగ్.. దొరికిపోతావ్ అంటూ..!

ABN , Publish Date - Jun 21 , 2025 | 03:24 PM

కఠినమైన ఇంగ్లండ్ టూర్‌ను భారత్ సానుకూలంగా ఆరంభించింది. లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో మన బ్యాటర్లు చెలరేగి ఆడుతున్నారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్‌తో పాటు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ సూపర్ సెంచరీలతో మెరిశారు.

Gill-Rishabh: గిల్‌కు పంత్ వార్నింగ్.. దొరికిపోతావ్ అంటూ..!
Gill-Pant,

ఇంగ్లండ్ పర్యటన విసురుతున్న కఠినమైన సవాల్‌ను భారత్ చాలా సమర్థంగా ఎదుర్కొంటోంది. లీడ్స్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్ట్‌లో పర్యాటక జట్టు బెండు తీస్తున్నారు భారత బ్యాటర్లు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా రెచ్చిపోయి ఆడుతోంది. బరిలోకి దిగిన ప్రతి బ్యాటర్ సూపర్బ్ నాక్స్ ఆడుతున్నారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (101), కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (127 నాటౌట్) సెంచరీలతో వీరవిహారం చేశారు. కేఎల్ రాహుల్ (42), రిషబ్ పంత్ (65 నాటౌట్) కూడా కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. అయితే మొదటి రోజు ఆటలో గిల్ బ్యాటింగ్ హైలైట్‌ అనే చెప్పాలి. కెప్టెన్సీ చేపట్టాక తొలి టెస్ట్‌లోనే భారీ సెంచరీతో తానేంటో మరోమారు నిరూపించాడు. అయితే గిల్ బ్యాటింగ్ సమయంలో పంత్ అతడికి వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. అసలేం జరిగిందంటే..


దొరికిపోతావ్..

లీడ్స్ టెస్ట్ మొదటి రోజు చివరి సెషన్ జరుగుతోంది. గిల్‌తో పాటు పంత్ క్రీజులో ఉన్నారు. భారత్ మరికొన్ని ఓవర్లు ఆడితే డే-1ను విజయవంతంగా ముగించొచ్చు. ఈ తరుణంలో బౌలింగ్‌కు దిగిన స్పిన్నర్ షోయబ్ బషీర్‌ను గిల్ సమర్థంగా ఎదుర్కొన్నాడు. అయితే పదే పదే ముందుకు వచ్చి బంతుల్ని డిఫెండ్ చేయసాగాడు గిల్. దీంతో పంత్ వెంటనే అతడ్ని హెచ్చరించాడు. ‘స్టంప్ వదిలి ముందుకు వస్తున్నావంటే బంతిని కిందకే ఉంచు. బంతిని సమర్థంగా డిఫెన్స్ చెయ్ లేదంటే దొరికిపోతావ్’ అంటూ గిల్‌ను అప్రమత్తం చేశాడు పంత్.


భారీ సిక్స్‌తో..

పంత్ సలహాతో గిల్ మరింత జాగ్రత్తగా బ్యాటింగ్ చేశాడు. అయితే ఒకవైపు శుబ్‌మన్‌ను అప్రమత్తంగా ఆడమని సూచించిన రిషబ్.. మరోవైపు హిట్టింగ్‌కు దిగాడు. క్రిస్ వోక్స్ వేసిన చివరి ఓవర్‌లో డీప్ స్క్వేర్ లెగ్ దిశగా భారీ సిక్స్ బాదాడు పంత్. అప్పటికే కొన్ని బౌండరీలతో ప్రత్యర్థులను భయపెట్టిన రిషబ్.. రెండో రోజును సూపర్ సిక్స్‌తో ముగించాడు. జైస్వాల్, గిల్ సెంచరీలతో వణికిన ఇంగ్లండ్.. పంత్‌ నాక్‌తో పూర్తిగా డిఫెన్స్‌లో పడిపోయింది. మరి.. రెండో రోజు ఆటలో ఈ బ్యాటిల్ ఇలాగే సాగుతుందేమో చూడాలి.


ఇవీ చదవండి:

టీమిండియాలో టెన్షన్! కారణం ఇదే..

స్వర్ణాల వేటలో షణ్ముఖి గణేశ్‌

జెమీమాను రిటైన్‌ చేసుకున్న బ్రిస్బేన్‌

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 21 , 2025 | 04:14 PM