Share News

Yashasvi Jaiswal: యశస్వి జైస్వాల్ సూపర్ ఇన్నింగ్స్.. బ్రాడ్‌మెన్ రికార్డు బద్దలు

ABN , Publish Date - Jun 21 , 2025 | 12:50 PM

ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు అదరగొట్టారు. ముఖ్యంగా ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్భుత సెంచరీతో కదం తొక్కాడు. ఈ క్రమంలో పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఏకంగా ఆస్ట్రేలియా దిగ్గజం డాన్ బ్రాడ్‌మెన్ రికార్డును కూడా బద్దలుగొట్టాడు.

Yashasvi Jaiswal: యశస్వి జైస్వాల్ సూపర్ ఇన్నింగ్స్.. బ్రాడ్‌మెన్ రికార్డు బద్దలు
Yashasvi Jaiswal Records

ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు అదరగొట్టారు (ENG vs IND) ముఖ్యంగా ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) అద్భుత సెంచరీతో కదం తొక్కాడు. ఈ క్రమంలో పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఏకంగా ఆస్ట్రేలియా దిగ్గజం డాన్ బ్రాడ్‌మెన్ (Don Bradman) రికార్డును కూడా బద్దలుగొట్టాడు. ఇంగ్లండ్‌తో జైస్వాల్ ఇప్పటివరకు 10 ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఆ పది ఇన్నింగ్స్‌ల్లో 90.33 సగటుతో 813 పరుగులు చేశాడు. ఇంగ్లండ్‌పై బ్రాడ్‌మన్ సగటు 89.78 మాత్రమే (Yashasvi Jaiswal Records).


ఇది మాత్రమే కాదు.. ఈ ఇన్నింగ్స్‌తో మరికొన్ని రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లలో ఆడిన తొలి టెస్ట్ మ్యాచ్‌లోనే సెంచరీలు కొట్టిన తొలి విదేశీ ఆటగాడిగా జైస్వాల్ నిలిచాడు. అలాగే హెడింగ్లీలో సెంచరీ చేసిన తొలి భారత ఓపెనర్‌గా నిలిచాడు. ఇక, ఇంగ్లండ్‌లో ఆడిన తొలి టెస్ట్ మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన ఐదో టీమిండియా బ్యాటర్‌గా కూడా జైస్వాల్ నిలిచాడు. జైస్వాల్ కంటే ముందు మురళీ విజయ్, విజయ్ మంజ్రేకర్, సౌరవ్ గంగూలీ, సందీప్ పాటిల్ ఇంగ్లండ్‌లో ఆడిన తొలి టెస్ట్ మ్యాచ్‌ల్లో సెంచరీలు చేశాారు.


అలాగే హెడింగ్లీలో తొలి వికెట్‌కు అత్యధిక పరుగులు జోడించిన టీమిండియా ఓపెనింగ్ జోడీగా కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ నిలిచారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 91 పరుగులు జోడించి అంతకు ముందు సునీల్ గవాస్కర్, కృష్ణమాచారి శ్రీకాంత్ (64) రికార్డును అధిగమించారు. ఈ మ్యాచ్‌లో జైస్వాల్‌తో పాటు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (127 నాటౌట్) కూడా అజేయంగా సెంచరీ సాధించాడు.


ఇవీ చదవండి:

రెండేళ్ల తర్వాత పారిస్ డైమండ్ లీగ్ టైటిల్‌ గెల్చుకున్న నీరజ్ చోప్రా

తొలి టెస్ట్‌లో సత్తా చాటిన్ గిల్.. కోహ్లీ రికార్డు బద్దలు

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 21 , 2025 | 12:50 PM