Sachin Tendulkar: టీమిండియాపై సచిన్, గంగూలీల ప్రశంసలు.. మూడో సెంచరీ ఎవరిదంటూ ప్రశ్న
ABN , Publish Date - Jun 21 , 2025 | 10:40 AM
హెడింగ్లీలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో మొదటి రోజు భారత ఇన్నింగ్స్ క్రికెట్ లెజెండ్స్ సచిన్, గంగూలీలను మురిపించింది. రెండు సెంచరీలు నమోదు కావడంతో మూడో సెంచరీ ఎవరిదని సచిన్ ప్రశ్నించాడు. దీనికి గంగూలీ ఆస్తికర సమాధానమిచ్చాడు.

Sachin Headingly 2002 Test: అంతా యువ క్రికెటర్లే.. టాలెంట్‌కు తక్కువేమీ లేకపోయినా అనుభవరాహిత్యం, పైపెచ్చు ఇంగ్లండ్‌లో కఠిన పరిస్థితులు.. ఇలా జనాలు టీమిండియాపై ఎన్నో సందేహాలు వ్యక్తం చేశారు. వాటన్నిటికీ శుభ్‌మన్ గిల్ జట్టు.. టెస్టు మ్యాచ్ తొలి రోజునే గట్టి సమాధానం ఇచ్చింది. హెడింగ్లీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో మొదటి రోజు ఏకంగా రెండు సెంచరీలతో జట్టుకు ఢోకాలేదన్న భరోసా కల్పించింది.
ఆట మొదటి రోజును టీమిండియా 359/3 స్కోరుతో ముగించింది. గిల్ (127 నాటౌట్), జైశ్వాల్ (101) అద్భుత ప్రదర్శనలకు తోడు రిషభ్ పంత్(64) కూడా రాణించాడు. టీమిండియా ప్రదర్శన క్రికెట్ లెజెండ్స్ సచిన్ టెండుల్కర్, గంగూలీలను ఆకట్టుకుంది. 2002లో తాము ఇదే మైదానంలో ఇంగ్లండ్‌ను ఢీకొన్న రోజులను గుర్తుకు తెచ్చింది. ఈ విషయమై సచిన్ తొలుత ఎక్స్ వేదికగా స్పందిస్తూ టీమిండియాపై ప్రశంసలు కురిపించాడు.
‘కేఎల్ రాహుల్, జైశ్వాల్ ఇన్నింగ్స్ జట్టుకు గట్టి పునాది వేశాయి. యశస్వి, గిల్‌కు సెంచరీలు సాధించినందుకు శుభాకాంక్షలు. రిషభ్ పంత్ ఇన్నింగ్స్ కూడా జట్టుకు కీలకమే. అయితే, తొలి రోజున టీమిండియా బ్యాటింగ్ చూసి నాకు 2002 నాటి హెడింగ్లీ టెస్టు గుర్తొచ్చింది. తొలి ఇన్నింగ్స్‌లో రాహుల్, గంగూలీ, నేను సెంచరీలు సాధించాము. ఆ టెస్టులో విజయం సొంతం చేసుకున్నాము. ఈమారు యశస్వి, శుభ్‌మన్ తమ బాధ్యతను నిర్వర్తించారు. మరి మూడో సెంచరీ ఎవరు సాధిస్తారు?’ అని సచిన్ ప్రశ్నించారు. గంగూలీని కూడా ట్యాగ్ చేశాడు.
దీనికి సౌరవ్ గంగూలీ కూడా మరింత ఉత్సాహంగా స్పందించాడు. ఈసారి మూడు కాదు నాలుగు సెంచరీలు నమోదు కావొచ్చని అన్నాడు. పంత్ లేదా కరుణ్ వీటిని సాధించొచ్చని చెప్పాడు. అయితే, 2002 టెస్టుతో పోలిస్తే ఈసారి పిచ్ కాస్త బ్యాటింగ్‌కు అనుకూలించిందని అన్నారు.
ఇక ఇంగ్లండ్‌తో తొలి టెస్టు ఆడుతున్న జైశ్వాల్..సెంచరీతో మురిపించాడు. టీమిండియాకు టెస్టుల్లో సారథ్యం వహించడం గిల్‌కు తొలిసారి అయినా అద్భుతంగా రాణించాడు. ఎలాంటి ఒత్తిడి లేకుండా అలవోకగా షాట్స్ ఆడుతూ మురిపించాడు. ఇక యువతరం టైమ్ వచ్చేసిందని చెప్పకనే చెప్పాడు. ఈ టెస్టు కూడా భారత్‌కు ఓ మధుర స్మృతిగా మిగిలిపోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఇవీ చదవండి:
రెండేళ్ల తర్వాత పారిస్ డైమండ్ లీగ్ టైటిల్ గెల్చుకున్న నీరజ్ చోప్రా
సేవింగ్స్ అకౌంట్‌లో మీ డబ్బు ఉందా.. అయితే మీరీ విషయాలు
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి